
హ్యాండ్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. కాగా పోటీల్లో డి.వర్షిని, పి.శృతి, వి.శ్రీజ, బి.అఖిల, పి.ధాత్రి, కె.నందు, జి.రమ్య, పి.స్రవంతి, డి.భవాని, కె.శివాని, కె.శ్రీజ, ఎం.అలేఖ్య, ఆశ్ర ముస్కాన్, ఇ.కీర్తి, ఎ.పూజ, డి.చంద్రకళ, ఎం.దుర్గాభవాని ఎంపికయ్యారు. ముందుగా ఈ పోటీలను ప్రారంభించిన అనంతరం నల్లగొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కె.నర్సిరెడ్డి ఆకాక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30 వరకు ఆసిఫాబాద్ జిల్లాలోని మందమర్రిలో జరిగే 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్‌లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ టాలెంట్ హంట్‌లో పాల్గొని 4వ స్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు సభ్యులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో చింతకాయల పుల్లయ్య, కవిత, చైతన్యకుమార్, పద్మిని గుప్తా, రామాంజనేయులు, మహేష్, నరేష్, పూర్ణబాబు, అంజి, నరేష్, ఆస్మా, మహేష్ పాల్గొన్నారు.