
అదనపు బ్లాక్ నిర్మాణ స్థలం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ కలెక్టరేట్‌లో నూతనంగా నిర్మి ంచనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అదనపు బ్లాక్‌కు నిర్మాణ పనులకు ఈ నెల 23న మంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు, ఆ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్, చినపాక లక్ష్మీనారాయణ, నూనె రామస్వామి, గుర్రం వెంకటరెడ్డి, వెంకన్న, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండ డీఎస్‌ఓగా టి.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్‌లో ఏఎస్‌ఓగా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. శనివారం ఆయన ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీఎస్‌ఓగా పని చేస్తున్న హరీష్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
కార్పొరేట్ కళాశాలల నుంచి దరఖాస్తులు
నల్లగొండ : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేట్ జూనియర్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి ప్రేమ్‌కరణ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉత్తీర్ణత శాతం, ఐదు సంవత్సరాల అకడమిక్ ప్రొపైల్, రెసిడెన్షియల్ వసతి, ఉన్నత ప్రమాణాలు కలిగిన కళాశాలలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హార్డ్ కాపీని ఈ నెల 30వ తేదీలోగా కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికై న కళాశాలల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు రూ.35 వేలు, ప్యాకెట్ మనీ కింద రూ.3 వేలు ఇస్తామని తెలిపారు.

అదనపు బ్లాక్ నిర్మాణ స్థలం పరిశీలన

అదనపు బ్లాక్ నిర్మాణ స్థలం పరిశీలన