
రైతును ముంచిన వడగండ్ల వాన
శాలిగౌరారం మండలంలో
1190 ఎకరాల్లో..
శాలిగౌరారం : అకాల వర్షానికి శాలిగౌరారం మండల వ్యాప్తంగా 1190 ఎకరాలోల పంటలు, 23 ఇళ్లు దెబ్బతిన్నట్లు తహసీల్దార్ యాదగిరి, ఏఓ సౌమ్య శృతి తెలిపారు. వరి 900 ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, నిమ్మతోటలు 260 ఎకరాల్ల దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, ధ్కంసమైన ఇళ్లను తహసీల్దార్ యాదగిరి సిబ్బందితో కలిసి పరిశీలించారు.
ఫ 200 ఎకరాల్లో దెబ్బతిన్న తోటలు
ఫ విరిగిపోయిన మామిడి, నిమ్మ చెట్లు
నకిరేకల్ : ఈదురుగాలులు, వడగండ్ల వర్షం రైతులను నిండా ముంచాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా వీచిన గాలులతో మామిడి, నిమ్మ చెట్ల నేల కూలాయి. వడగండ్ల దాటికి కోతకొచ్చిన వరిచేలు దెబ్బతిన్నాయి. నకిరేకల్ మండలంలో ఆదివారం సాయంత్ర ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో సుమారు 210 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఓగోడు, పాలెం, టేకులగూడెం, నడిగూడెం, వల్లాబాపురం, నోముల, కడపర్తి గ్రామాల్లో నిమ్మ, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు 100 మంది రైతుల తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన అదికారులు నిర్ధారించారు. సోమవారం నకిరేకల్ ఉద్యానవన క్లస్టర్ అధికారి ప్రవీణ్ ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న తోటలను సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు.
200 నిమ్మ చెట్లు విరిగిపోయాయి
నేను 25 ఏళ్ల నుంచి నిమ్మ తోట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఈదురుగాలుల దాటికి 200 నిమ్మ చెట్లు పూర్తిగా విరిగిపోయాయి. తోటలోనే ఉన్న నా ఇంటి పైకప్పు రేకులు కూడా లేయిపోయాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. నిమ్మ తోటే మాకు బతుకుదెరువు.. ప్రభుత్వమే మాకు సాయం చేసి ఆదుకోవాలి.
– జక్కు వెంకట్‌రెడ్డి, రైతు టేకులగూడెం
నష్టం అంచనా వేస్తున్నాం
నకిరేకల్ మండలంలో సూమారు 200 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉన్న సమయంలోనే నష్టం వాటిల్లింది. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం.
– ప్రవీణ్‌కుమార్, ఉద్యాన అధికారి, నకిరేకల్
●

రైతును ముంచిన వడగండ్ల వాన