
మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి
నల్లగొండ టౌన్: నిడమనూరు మండలం బొక్కముంతలపహాడ్ గ్రామంలో ఇటీవల మల్లీశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని ఉరితీయాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రేమపేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం రాత్రి నల్లగొండలోని గడియారం సెంటర్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు అనుముల సురేష్, పాలడుగు నాగార్జున, బొజ్జ పాండు, కత్తుల జగన్, కత్తుల సన్నీ, చింత శివరామకృష్ణ, రత్నకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.