
తుక్కాపురానికి బిహార్ సర్పంచ్‌ల బృందం
భువనగిరి: మండలంలోని తుక్కాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం బిహార్ రాష్ట్రానికి చెందిన 34 మంది సర్పంచ్‌ల బృందం నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు పంచాయతీ పరిధిలో చేపట్టిన హరితవనం, ఇంకుడు గుంతలు, మహిళా సంఘాల కార్యక్రమాలు, తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ, అంగన్‌వాడీలో అందిస్తున్న పౌష్టికారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు చాలా బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, బృందం కోర్సు డైరెక్టర్ కడారి రాజేశ్వర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.