వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు.
తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్‌ఏంజెలెస్ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment