Strong Winds
-
Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
కోల్‌కతా: తీవ్ర తుపాను ‘రెమాల్’ ధాటికి పశ్చిమబెంగాల్ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని ఆదివారం యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెమాల్తో నష్టం తక్కువేనని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లవచ్చని చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు ఆది, సోమవారాల్లో కొన్ని రైళ్లను రద్దు చేశాయి. కోల్‌కతా విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు బయలుదేరాల్సిన, రావాల్సిన 394 సరీ్వసులను రద్దు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్‌తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, సహాయక కార్యక్రమాల సన్నద్ధతపై అధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష జరిపారు.బంగ్లాదేశ్‌లో...బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్ హెచ్చరికను, కోక్స్ బజార్, చిట్టోగ్రామ్లలో 9వ నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో విమాన సరీ్వసులను రద్దు చేశారు. -
అమెరికాలో ‘హిల్లరీ’ బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు. తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ఏంజెలెస్ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు. -
బలహీనపడిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, నెట్వర్క్: అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాలపై విస్తరించిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో జలకళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారంతో పోల్చితే గురువారం పలు జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.24 సెంటీ మీటర్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 6.02 సెంటీ మీటర్లు, విశాఖపట్నం జిల్లాలో 5.24 సెంటీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 4.48 సెంటీ మీటర్లు, నంద్యాల జిల్లాలో 4.43 సెంటీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4.19 సెంటీ మీటర్లు చొప్పున అత్యధిక వర్షపాతం కురిసింది. తిరుపతి జిల్లాలో 0.21 సెంటీ మీటర్లు అత్యల్ప వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కురిసిన వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టుల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటి కప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. తాజా వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. విజయవాడ–హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు మున్నేరు వాగు ఉద్ధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. -
వారం వరకు వడగాడ్పులుండవు
సాక్షి, విశాఖపట్నం: మూడు వారాల నుంచి కొద్దిరోజుల కిందటి వరకు దడపుట్టించిన వడగాడ్పులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ సమాచారం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. 4 రోజుల కిందటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. అల్పపీడన ద్రోణి, విండ్ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతున్నాయి. ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వరకు ఒకింత ప్రభావం చూపుతున్నా ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల సాధారణంగాను, కొన్నిచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువగాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు. వడగాడ్పులు లేవు. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మునుపటికంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొనసాగుతాయని, అందువల్ల అప్పటివరకు వడగాడ్పులు వీచే అవకాశాల్లేవని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. మే నెల సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ ఆఖరి వరకు ఇంకెంత ఉష్ణతీవ్రతను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఈ సమాచారం ఊరటనిచ్చే అంశమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మధ్యాహ్నం వేళ వరకు ఒకింత ఉష్ణ తీవ్రత అనిపించినా ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతోందని చెప్పారు. -
అతని సమాధానం విని ఆశ్చర్యపోయా: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మీడియాకు ఆసక్తికరమైన అనుభూతుల్ని పంచుకోవడంలో ముందుంటారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వంతెనల నిర్మాణం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గడ్కరీ.. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ఓ అనుభవం గురించి తెలిపారు. ‘‘బీహార్ సుల్తాన్‌గంజ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఈ మధ్య కూలిపోయింది. ఏప్రిల్ 29న ఈ ఘటన జరిగింది. కారణం ఏంటని నా సెక్రెటరీని అడిగా.. అతను ‘బలమైన గాలుల వీయడం వల్లే కూలింది సార్’ అన్నాడు. ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉండి.. ఆయన అలాంటి వివరణ ఇచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. వెంటనే నేను.. ‘గాలులకు బ్రిడ్జి కూలిపోవడం ఏంటయ్యా. మరేదైనా కారణం అయ్యి ఉండొచ్చేమో’ అంటూ ఖుల్లాగా నా అభిప్రాయం చెప్పేశా. దేశంలో వంతెనల నిర్మాణంలో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఇలాంటి ఘటనలను పరిగణనలోకి తీసుకుని నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకూడదంటూ ఢిల్లీలో ఓ ఈవెంట్‌కు హాజరైన గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. సుల్తాన్‌గంజ్‌లో జరిగిన ఘటనపై సీఎం నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సుమారు 1,700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న భారీ బ్రిడ్జి ఇది. 2014లోనే మొదలైన పనులు.. ఇంకా పూర్తి కొనసాగుతున్నాయి. అలాంటిది గాలులకు కూలిపోవడం ఏంటన్న ఆశ్చర్యమూ వ్యక్తం అవుతోంది అంతటా. -
దూసుకొస్తున్న రాయ్ తుఫాన్! 8 ప్రాంతాల్లో హై అలర్ట్..
Rai Typhoon Update: ఫిలిప్పీన్స్ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్ టైఫూన్ వేగంగా కదులుతోంది. రానున్న రోజుల్లో ఈదురు గాలుల్తోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇది ఈ ఏడాది దేశాన్ని తాకిన 50వ తుఫాను మాత్రమేకాకుండా అత్యంత శక్తివంతమైన తుఫానుగా వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఇప్పటికే వేలాది మంది ప్రజలను ఆ దేశ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలా మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు కూడా. సూపర్ టైఫూన్‌గా అమెరికా ప్రకటన కాగా ఫిలిప్పీన్స్ వైపు దూసుకుపోతున్న రాయ్ టైఫూన్‌ను అమెరికా నేవీ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ‘సూపర్ టైఫూన్'గా అభివర్ణించింది. దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారబోతోందని తెల్పింది. గంటకు 185 కి.మీ వేగంతో.. ఫిలిప్పీన్స్‌లో రాయ్ హరికేన్ 185 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విపత్తు నిర్వహణ బృందం అన్ని నౌకలను ఓడరేవులో ఉంచాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో హై అలర్ట్ నివేదికల ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లోని 8 ప్రాంతాల్లో అత్యవసర సన్నాహాలు పూర్తయ్యాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. టైఫూన్ కారణంగా పసిఫిక్ మహాసముద్రం సమీప ప్రాంతాల్లోని సుమారు 98,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే 8 ప్రభావిత ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు విసాయా - మిండనావో ఐలాండ్ల మధ్య ఉన్నాయి. విమానాలు, ఓడరేవులు పూర్తిగా మూసివేయబడ్డాయి తుఫాను సమయంలో, ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్నట్లు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ ఘోర విపత్తు దృష్ట్యా ఫిలిప్పీన్స్‌కు వెళ్లే అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. అన్ని పోర్టులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. చదవండి: పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య.. -
వైరల్: వధువు పెళ్లి గౌనులోకి దూరిన వ్యక్తి.. అందరూ చూసేశారు!
పెళ్లిలో వధూవరులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా తయారవ్వడం అందరికీ తెలిసిన విషయమే. వారి ఆచారాలు, సంప్రదాయలు ఏమైనప్పటికీ అందరికంటే స్పెషల్‌గా ముస్తాబవుతారు. అయితే వధూవరులిద్దరిలో ఎక్కువగా అందరి కళ్లు పెళ్లి కూతురుపైనే ఉంటుంది. ఆమె వస్త్రాధారణ, అభరణాలు, మేకప్ ఇలా అన్నింటిపై ప్రతి ఒక్క దానిని గమనిస్తూ ఉంటారు. ఇక వధువుని పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చే సీన్ పెళ్లితంతు మొత్తంలో హైలెట్‌గా నిలుస్తోంది. పైన చెప్పిన విధంగానే ఓ పెళ్లి కార్యక్రమంలో వధువు అందమైన గౌనులో రెడీ వేదిక వద్దకు నడుచుకుంటూ వచ్చింది. వరుడు ఆమెను చేతిని అందుకుంటున్న క్షణంలో ఓ వ్యక్తి ఆమె గౌను కింద నుంచి ఓ వ్యక్తి అనూహ్యంగా బయటకు వచ్చాడు. అది చూసిన వరుడితో సహా అతిథులంతా నోరెళ్లబెట్టారు. అయితే, అసలు విషయం తెలిసి అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.ఫిలిప్పీన్స్‌లో జరిగిన పెళ్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోయల్ లునేసా అనే వ్యక్తి బ్రైడల్ ఇవెంట్స్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా ఓ పెళ్లిలో వధువు కోసం ఆ సంస్థ గౌను తయారు చేసింది. అయితే, పెళ్లి రోజున గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో. వధువు ఆ గౌనులో నడుస్తుంటే.. గాలికి పైకి లేస్తోంది. గౌను పైకి లేవకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరికి రోయల్ ఓ నిర్ణయం ఆలోచించి. అతడు వధువు గౌనులోకి దూరతానని చెప్పాడు. ముందు అందరూ అతని నిర్ణయాన్ని ఆశ్చర్యంగా చూసినా.. చివరికి అంగీకరించారు. దీంతో అధిక గాలులకు డ్రెస్ ఎగరకుండా సక్రమంగా ఉంచేందుకు ఆమె దుస్తుల కింద అతను దాక్కున్నాడు. ఇలా వధువు పెళ్లి వేడుక వద్దకు చేరే వరకు ఆమె గౌనులోనే ఉన్నాడు. వరుడు ముందుకొచ్చి ఆమె చేతిని అందుకోగానే.. అతను ఆమె గౌను నుంచి వేగంగా బయటకు వచ్చేశాడు. అయితే అతన్ని ఎవరూ చూడలేదు అనుకున్నాడు కానీ అప్పటికే అతిథులు అది చూసి షాక్‌కు గురయ్యారు. అంతేగాక కెమెరాలోనూ ఇదంతా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనంతరం ఈ విషయంపై రోయల్ మాట్లాడుతూ.. తను నిజంగా వధువు పెళ్లి దుస్తుల కింద దూరిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. అంతేగాక అందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు. పెళ్లిలో బలంగా గాలులు వీస్తుండటంతో వధువు తన డ్రెస్‌తో ఇబ్బంది పడుతుందని, అందుకే ఏం చేయాలో తెలియక అలా చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. వధువు ఆ గౌను లోపల మరో డ్రెస్ వేసుకుందని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్ ఏంటంటే! ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు! -
గాలి బలంగా వీచి.. బస్సును వెనక్కి నెట్టి..
సాక్షి, సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బలంగా వీచిన ఈదురు గాలులు ఏకంగా ఓ బస్సునే వెనక్కు నెట్టేశాయి. శనివారం సాయంత్రం ఈదురు గాలుల ప్రభావంతో పట్టణ శివారులో మారుతి రెస్టారెంట్ సమీపంలో పార్కింగ్ చేసిన ఓ ప్రయివేట్ బస్సు కదులుకుంటూ వెనక్కి వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది దూరం మేర బస్సు గాలి తాకిడికి 100 మీటర్ల మేర వెనక్కి వెళ్లిన దృశ్యాలు ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
తెలుగు రాష్ట్రల్లో వరుణుడి బీభత్సం,పంట నష్టం
-
పలు జిల్లాల్లో అకాల వర్షాలు పంట నష్టం
-
ఏపీ: పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం
సాక్షి, అమరావతి: రాష్ట వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుముల మెరుపులతో కూడిన వడగండ్ల వానతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. కృష్ణా జిల్లా కురవటంతో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలు చిగురుటాకులా వణికాయి. దీంతో మామిడి ,కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. కృత్తివెన్ను పల్లెపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. నిడమరు పంచాయతీలో మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతవటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం: పర్చూరు ప్రాంతంలో చిరుజల్లులు కురవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులు, మిర్చిని పరదాలతో కాపాడుకోటానికి పాట్లు పడ్డారు. పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున ఉరుములతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నెలరాలాయి. మొక్కజొన్న, వరి పంటలు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గుంటూరు: జిల్లాలో పలు చోట్ల చెదరుమదరుగా వర్షం కురిసింది. పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేటలో మోస్తరు వర్షం పడింది. పొన్నూరు మండలం కొండముదిలో పిడుగుపడి రెండున్నర ఎకరాల వరికుప్ప దగ్ధం అయింది. తూర్పు గోదావరి: జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న, ధాన్యాన్నివర్షం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అకాల వర్షాలు.. 28 మంది మృతి
లక్నో: గురువారం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్, సీతాపూర్, చాందౌలీ, ముజాఫర్‌నగర్, భాగ్‌పట్, బిజ్నోర్, ఔన్‌పూర్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పంట, పశువుల నష్టాన్ని అంచనా వేయాలని.. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. వర్షాలకు తోడు గాలిదుమ్ముల కారణంగా గోధుమలు, ఆవాలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. బంగాళా దుంపల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. (చదవండి: కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు) -
వణికించిన గాలులు
విజయనగరం గంటస్తంభం : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయనగరం, బొబ్బిలి, గంట్యాడ, ఎస్.కోట, తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు వణికిపోయారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. జిల్లా కేంద్రంలో అరగంట పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు వాతావరణం చల్లగా మారడంతో పట్టణ ప్రజలు సేదదీరారు. ఇంతలోనే ఆరున్నర గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకేసారి భారీగా ఈదురుగాలులు వీచాయి. సుడిగాలి మాదిరిగా గాలులు వీయడంతో ఎక్కడికక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు గాలిధాటికి కింద పడ్డాయి. పురిపాకలు, తాత్కాలిక షెడ్లు ఎగిరిపోయాయి. ఇదిలాఉంటే ఉరుములు, మెరుపులతో వాతావరణం భయంకరంగా మారింది. పట్టణంలో కలెక్టరేట్, కేఎల్.పురం, ఎన్సీఎస్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మిగతాచోట్ల ఒక మోస్తారు వర్షం పడింది. నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇదిలాఉండగా ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పలుప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోవడం.. వాటిపై కొమ్మలు పడడంతో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కూలిన విద్యుత్ స్తంభాలు బొబ్బిలి : బొబ్బిలి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి ప్రజలు భయాందోళన చెందారు. ఈదురుగాలులకు కొన్ని చెట్లు నేలకూలగా మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో బొబ్బిలి, చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి మండలంలోని ముత్తాయవలస, కమ్మవలస, పిరిడి.. బాడంగి మండలం గజరాయునివలస, డొంకినవలస, లక్ష్మీపురం, తెంటువలస... రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా మేఘం కుమ్ముకుంది. అప్పటివరకు తీవ్రమైన ఎండ కాయడంతో ఇబ్బంది పడిన ప్రజలు సాయంత్రం వాతావరణం చల్లబడడంతో సేదదీరారు. అయితే ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బొబ్బిలి ఏడీఈ లచ్చుపతుల సత్యనారాయణ తన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. మరోపక్క చాలా ప్రాంతాల్లో చెట్లు, కూరగాయల పందిళ్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం నియోజకవర్గంలోని బొబ్బిలి, తెర్లాం, బాడంగి, రామభద్రపురం మండలాలతో పాటు బొబ్బిలి పట్టణం, సీతానగరం మండలాల్లో ఈదురు గాలులకు 62కు పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బొబ్బిలి రూరల్‌లో 18 హెచ్‌టీ, 14 ఎల్టీ విద్యుత్ స్తంభాలు..నవ్య జూట్‌మిల్ వైపు 5 హెచ్‌టీ.. గ్రోత్ సెంటర్‌వద్ద 6 హెచ్‌టీ స్తంభాలు నేలకొరిగినట్లు ఏడీఈ సత్యనారాయాణ తెలిపా రు. అలాగే సీతానగరం మండలం బూర్జి ప్రాంతంలో 8 హెచ్‌టీ, 14 ఎల్టీ.. బాడంగిలో రెండు స్తంభాలు పడిపోయినట్లు రూరల్ ఏడీఈ కిశోర్‌కుమార్ చెప్పారు.దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేలరాలిన మామిడి.. అసలే దిగుబడి లేక దిగాలుగా ఉన్న మామిడి రైతులను ఈదురుగాలులు నడ్డివిరిచాయి. ఉన్న కొద్దిపాటి కాయలు కూడా గాలులకు నేలరాలాయి. పిడుగు పడి మహిళ మృతి బొబ్బిలి : మండలంలోని కొత్తపెంటకు చెందిన మహిళ పిడుగుపాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన బేతనపల్లి సావిత్రి (55) బుధవారం మధ్యాహ్నం చెరుకు నాటే పనులకు వెళ్లింది. ఈ సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కిందికు చేరింది. ఈ సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు సావిత్రిని బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త సత్యనారాయణ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏఎస్ఐ చదలవాడ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లుంబేసులో గిరిజనుడు ... గుమ్మలక్ష్మీపురం : మండలంలోని లుంబేసు గ్రామానికి చెందిన పత్తిక ప్రసాద్ (57) అనే గిరిజనుడు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తన జీడితోటలో జీడిపిక్కలు ఏరుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇంటికి పయనమయ్యాడు. గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా పిడుగు పడడంతో ప్రసాద్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతర కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు 108 సభ్యులకు కూడా సమాచారం చేరవేశారు. సకాలంలో 108 వాహనం రాకపోయేసరికి ఆటోలో ప్రసాద్‌ను భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు సాగర్ పరీక్షించి ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నేలకొరిగిన ఎన్టీఆర్ విగ్రహాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా, గంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది. గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విజయవాడ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపైకి పెద్ద ఎత్తున వర్షపునీరు చేరింది. గన్నవరం కీసరపల్లి దగ్గర రోడ్డు పక్కన ఉన్న భారీ ఎన్టీఆర్ విగ్రహాలు నేలకొరిగాయి. ఈదురు గాలులకు రోడ్డు మీదకు కొట్టుకొచ్చాయి. గుడవల్లి, కంకిపాడు, ఉయ్యూరులోనూ వర్షం పడింది. గుంటూరు జిల్లాలోనూ పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. దుగ్గిరాల మండలం చింతలపూడి వద్ద చెట్లు కూలిపోయాయి. తెనాలి-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఒంగోలులోనూ ఈదురు గాలులు కల్లోలం రేపాయి. -
చీపురు పుల్లలా గాల్లోకి లేచింది.. వైరల్ వీడియో
వాషింగ్టన్: గాలి వేగానికి ఓ చిన్నారి చీపురుపుల్లలా గాల్లోకి ఎగిరింది. అయితే ఎలాంటి గాయం కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని ఓహియోలో ఈ ఘటన జరిగింది. మాడిసన్ గార్డ్నర్ అనే నాలుగేళ్ల పాపను ఆమె తల్లి బ్రిటానీ గార్డ్నర్ స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చింది. కారు దిగిన మాడిసన్.. తన తల్లి స్మార్ట్ ఫోన్‌తో ఇంట్లోకి త్వరగా వెళ్లేందుకు పరుగు తీసింది. ఇంతలోనే మమ్మీ అంటూ పెద్ద కేక బ్రిటానీకి వినిపించింది. కూతురు మాడిసన్ స్కూలు బ్యాగ్ ను కారులోంచి తీసుకొస్తున్న ఆమె వెంటనే కూతురుకు ఏమైందో అంటూ చేతిలో ఉన్న వస్తువులు కింద పడేసి పరుగులు తీసింది. సీసీటీవీని పరిశీలించగా.. తాము ఇంటికి వచ్చినప్పుడు గాలి ఓ రేంజ్లో వీస్తోంది. ఓ చేతిలో ఫోన్ పట్టుకున్న మాడిసన్ మరో చేత్తో ఇంటి డోర్ అలా ఓపెన్ చేసిందో లేదో.. గాలి తీవ్రతకు అమాంతం గాల్లోకి లేచింది. కొన్ని సెకన్లలోనే మమ్మీ అంటూ అరుస్తూ కిందపడిపోయింది. పాప తల్లి బ్రిటానీ సీసీటీవీలో రికార్డయిన వీడియో చూసి మొదట షాక్ గురైనా.. పాపకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నా కూతురితో పాటు మీరు ఎగరగలరా అంటూ కామెంట్ చేస్తూ.. ఫేస్బుక్, ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసిన వీడియోకు విపరీతంగా లైక్స్, కామెంట్స్ రావడంతో పాటు పలువురు రీట్వీట్లు చేయడంతో వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 14 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. -
గోదావరి జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం
ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం ధాటికి గోదావరి జిల్లాల వాసులు ఇక్కట్లు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో వైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ పరిస్థితి అలాగే ఉంది. రహదారులపై చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
'గాలివాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయి'
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో శుక్రవారం సాయంత్రం 100 కి.మీ వేగంతో గాలులు వీచాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... గాలి వాన బీభత్సానికి 300 చెట్లు నేలకొరిగాయని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నామన్నారు. అలాగే ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని తెలిపారు. ఈ గాలివానకు ఇద్దరు చనిపోయారని... మరికొందరికి గాయాలయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
మత్య్సకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక
విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో ఈశాన్య రుతుపవనాలు బలంగా వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రకు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్య్స కారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
బిహార్‌లో తుపాను బీభత్సం
42 మంది మృతి, 80 మందికి గాయాలు పట్నా: బిహార్‌లోని 12 ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో మంగళవారం రాత్రి తుపాను బీభత్సం సృష్టించింది. 42 మంది మరణించగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేలాది గుడిసెలు, భారీ విస్తీర్ణంలో కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క పూర్ణియా జిల్లాలోనే 30 మంది చనిపోయారు. మాధేపురా, మధుబని, సమస్తిపూర్, దర్భంగా తదితర జిల్లాల్లో గాలివానకు వేలాది చెట్లు కూలిపోయాయి. నేపాల్ నుంచి తుపాను ఈ జిల్లాల మీదుగా విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని, ‘కాల్‌బైశాఖీ’గా పిలిచే ఈ తుపానులు ఈ సీజన్లో సాధారణమని పేర్కొంది. ప్రధాని మోదీ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు నితీశ్ రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
మత్స్యకారులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక
విశాఖపట్నం: రాగల 24 గంటలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం తదితరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది మరింత బలపడి ఒకటి, రెండు రోజులలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తాఆంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ** -
హెలెన్ దెబ్బకురైతు విలవిల
జిన్నారం: ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. వరి గింజలు చేలులోనే పడిపోతున్నాయి. ఆరు నెలలుగా కష్టపడి సాగు చేసుకున్న రైతులు తుపాన్ కారనంగా వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిన్నారం, గుమ్మడిదల, అనంతారం, వావిలాల, సోలక్పల్లి తదితర గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలవాలింది. దీంతో రైతులు కంట నీరుపెడుతున్నారు. తుక్కాపూర్‌లో నీటిపాలు తొగుట: మండలంలోని తుక్కాపూర్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం వర్షార్పణమైంది. మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో వర్షం నీరు అక్కడే నిలవడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కంటతడిపెట్టారు. మార్కెట్లో పాసైన ధాన్యం కుప్పలు, పాసవ్వడానికి సిద్ధంగా ఉన్న కుప్పలు సుమారు 5 వేల బస్తాలుండగా శనివారం నాటి వర్షానికి తడిసిపోయింది. కొంత ధాన్యం కొట్టుకుపోయింది. మార్కెట్లో కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడం వల్లే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బస్తాలను తూకం వేసినా అధికారుల నిర్లక్ష్యంతో లారీల కొరత కారణంగా లోడింగ్ కాకపోవడంతో బయట ఉన్న బస్తాలు సైతం వర్షానికి తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. కొనుగోలు చేయకనే.. చిన్నకోడూరు: మండలంలోని జక్కాపూర్, చిన్నకోడూరు, ఇబ్రహీంనగర్, రామంచ, అల్లీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కొనుగోలు కేంద్రాల్లో గోదాములు, కవర్లు, తదితర సౌకర్యాలు లేకపోవడంతో వర్షానికి తడిసినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తెచ్చి రెండు, మూడు రోజులు గడిచినా నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.తడిసిన ధాన్యాన్ని వెంటనే కోనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలకు ఆయా గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.