ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షం ధాటికి గోదావరి జిల్లాల వాసులు ఇక్కట్లు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో వైపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ పరిస్థితి అలాగే ఉంది. రహదారులపై చెట్లు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.