చీపురు పుల్లలా గాల్లోకి లేచింది.. వైరల్ వీడియో | four year girl swept off her feet by strong winds and video goes viral | Sakshi
Sakshi News home page

చీపురు పుల్లలా గాల్లోకి లేచింది.. వైరల్ వీడియో

Published Sun, Mar 12 2017 4:53 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

చీపురు పుల్లలా గాల్లోకి లేచింది.. వైరల్ వీడియో

చీపురు పుల్లలా గాల్లోకి లేచింది.. వైరల్ వీడియో

వాషింగ్టన్: గాలి వేగానికి ఓ చిన్నారి చీపురుపుల్లలా గాల్లోకి ఎగిరింది. అయితే ఎలాంటి గాయం కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమెరికాలోని ఓహియోలో ఈ ఘటన జరిగింది. మాడిసన్ గార్డ్‌నర్ అనే నాలుగేళ్ల పాపను ఆమె తల్లి బ్రిటానీ గార్డ్‌నర్ స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చింది. కారు దిగిన మాడిసన్.. తన తల్లి స్మార్ట్ ఫోన్‌తో ఇంట్లోకి త్వరగా వెళ్లేందుకు పరుగు తీసింది. ఇంతలోనే మమ్మీ అంటూ పెద్ద కేక బ్రిటానీకి వినిపించింది. కూతురు మాడిసన్ స్కూలు బ్యాగ్ ను కారులోంచి తీసుకొస్తున్న ఆమె వెంటనే కూతురుకు ఏమైందో అంటూ చేతిలో ఉన్న వస్తువులు కింద పడేసి పరుగులు తీసింది.

సీసీటీవీని పరిశీలించగా.. తాము ఇంటికి వచ్చినప్పుడు గాలి ఓ రేంజ్‌లో వీస్తోంది. ఓ చేతిలో ఫోన్‌ పట్టుకున్న మాడిసన్ మరో చేత్తో ఇంటి డోర్ అలా ఓపెన్ చేసిందో లేదో.. గాలి తీవ్రతకు అమాంతం గాల్లోకి లేచింది. కొన్ని సెకన్లలోనే మమ్మీ అంటూ అరుస్తూ కిందపడిపోయింది. పాప తల్లి బ్రిటానీ సీసీటీవీలో రికార్డయిన వీడియో చూసి మొదట షాక్ గురైనా.. పాపకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. నా కూతురితో పాటు మీరు ఎగరగలరా అంటూ కామెంట్ చేస్తూ.. ఫేస్‌బుక్, ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసిన వీడియోకు విపరీతంగా లైక్స్, కామెంట్స్ రావడంతో పాటు పలువురు రీట్వీట్లు చేయడంతో వీడియో ఇంటర్‌నెట్లో హల్ చల్ చేస్తోంది. శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియోకు 14 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement