![మత్స్యకారులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక](/styles/webp/s3/article_images/2017/09/2/51409835585_625x300.jpg.webp?itok=alnBoF9_)
మత్స్యకారులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక
విశాఖపట్నం: రాగల 24 గంటలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతం తదితరప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది మరింత బలపడి ఒకటి, రెండు రోజులలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, కోస్తాఆంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
**