Hilary
-
అమెరికాలో ‘హిల్లరీ’ బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు. తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్ఏంజెలెస్ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు. -
ఒహయో, ఫ్లోరిడాలే కీలకం
హిల్లరీ, ట్రంప్ సుడిగాలి ప్రచారం వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో ప్రధాన ప్రత్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌లు ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్న కీలక రాష్ట్రాల్లో వందల కోట్లు ప్రకటనలపై ఖర్చుచేస్తున్నారు. హిల్లరీ ఈ-మెయిల్ వివాదాన్ని ఎఫ్‌బీఐ తిరగదోడిన నేపథ్యంలో ఒపీనియన్ పోల్స్ తారుమారయ్యాయి. పలు జాతీయ సర్వేల్లో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య పోటీ నువ్వా - నేనా అన్నట్లు ఉంది. ఒహయో, ఫ్లోరిడా రాష్ట్రాలు కీలకం కావడంతో హిల్లరీ, ట్రంప్, దేశాధ్యక్షుడు ఒబామాలు చివరి వారం ఈ రాష్ట్రాలపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం హిల్లరీ ఫ్లోరిడా రాష్ట్రంలో 3 ర్యాలీల్లో ప్రసంగించగా... ఒబామా ఒహయోలో ప్రచారం చేశారు. ట్రంప్ వచ్చే రెండు రోజుల్లో ఫ్లోరిడాలో సుడిగాలి ప్రచారం చేస్తా రు. చివరి వారంలోనే ఇరు ప్రచార శిబిరాలు, వారికి మద్దతిస్తున్న గ్రూపులు దాదాపు రూ. 285 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు అంచనా. కాగా, నవంబర్ 8 ఎన్నిక కోసం ఇప్పటికే 2.8 కోట్ల మంది ఓటేశారు. మరోవైపు.. హిల్లరీకి మరో చిక్కు వచ్చిపడింది. ఆమె భర్త బిల్ క్లింటన్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బెల్జియం వ్యాపారి మార్క్రిచ్కు క్షమాభిక్ష పెట్టిన కేసులో 2001 నాటి విచారణ నివేదిక ఎఫ్‌బీఐ ట్విటర్ ఖా తాలో దర్శనమిచ్చింది.విచారణ 2005లోనే ముగించిన ఎఫ్‌బీఐ బిల్ క్లింటన్‌పై ఏ కేసూ నమోదు చేయలేదు.