మెక్సికో వైపు దూసుకొస్తున్న హరికేన్ ఉపగ్రహ చిత్రం
మెక్సికో సిటీ: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన విల్లా హరికేన్ మెక్సికో వైపుగా ప్రయాణిస్తోంది. క్రమంగా శక్తిని పుంజుకుంటున్న విల్లా.. సోమవారం నాటికి(స్థానిక కాలమానం ప్రకారం) కేటగిరి–5 హరికేన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం తెలిపింది. విల్లా హరికేన్ ప్రభావంతో మెక్సికో తీరంలో ఇప్పటికే గంటకు 249 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. మెక్సికోలొని కబోకోరియంటెస్ నగరానికి నైరుతి దిశలో 315 కి.మీ దూరంలో విల్లా హరికేన్ కేంద్రీకృతమై ఉందంది. ఈ హరికేన్ మెక్సికో పశ్చిమ తీరంపై పెను ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో మెక్సికోలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 46 సెం.మీ మేర వర్షం కురవనుంది.
Comments
Please login to add a commentAdd a comment