
నేడే విడుదల!
మనకు సినిమా ఇష్టమైన వినోదం. కానీ చాలా దేశాల్లో అదొక అరుదైన, ఖరీదైన వినోదం. యెమెన్ కూడా అలాంటి వాటిలో ఒకటి. ఆ దేశంలోని ప్రముఖ నగరం అదెన్‌లో ఉన్న ఏకైక థియేటర్ ‘హరికేన్’లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాలు పోస్టర్లివి. దశాబ్దాల కిందట విడుదలైన బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను ఆ థియేటర్లలో విడుదల చేస్తుంటారు. థియేటర్లను నడపగల వ్యాపారవేత్తలు, సినిమాలను విడుదల చేయగల డిస్ట్రిబ్యూటర్లే కాదు.. తరచూ టికెట్ కొని సినిమాలకు వెళ్లగల ప్రజలు కూడా లేరక్కడ. సినిమా వారికంత ఖరీదైన వినోదం మరి!