Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Police Told RCB To Hold Celebrations On Sunday, Franchise Rejected The Idea Says Report1
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో నిన్న (జూన్‌ 4) జరిగిన బెంగళూరు దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 47 మంది​కి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది.ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. బుధవారం​ (జూన్‌ 4) ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పట్టించుకోలేదు. విజయోత్సవ వేడులు బుధవారానికి బదులు ఆదివారం (జూన్‌ 8) నిర్వహించుకోవాలని సూచించారు.టైటిల్‌ గెలిచిన మరుసటి రోజే వేడుకలు నిర్వహిస్తే అభిమానుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, ఇది తీవ్రమైన గందరగోళానికి దారి తీయవచ్చని హెచ్చరించారు. అయినా ఆర్సీబీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఆదివారం వరకైతే విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని వాదించింది.వేడుకలు ఆదివారానికి వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. వేడి మీద వేడుకలు నిర్వహించకపోతే తమకు డ్యామేజ్‌ అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆర్సీబీ యాజమాన్యం వాదనతోనే ముందుకెళ్లింది.ఆర్సీబీ టైటిల్‌ను గెలిచిన మరు క్షణం నుంచే బెంగళూరు వీధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. జట్టు విజయోత్సవాలు జరుపుకుంటున్న అభిమానులు తెగ హడావుడి చేశారు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానం జరుగుతుందని తెలియడంతో అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గుమికూడవద్దని పోలీసులు ముందే హెచ్చరించినా అభిమానులు వినలేదు. తొక్కిసలాట జరిగిన సమయంలో స్టేడియం చుట్టూ రెండు లక్షలకు పైగా జనం ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత ఆర్సీబీ యాజమాన్యం ఓపెన్‌ టాప్‌ బస్‌లో ఆటగాళ్ల ఊరేగింపుకు ప్లాన్‌ చేసింది. అయితే తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు వస్తాయని పోలీసులు వారించడంతో వెనక్కు తగ్గింది. తీరా చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్యాన కార్యక్రమాన్ని ప్లాన్‌ చేస్తే, అది చివరి​కి విషాదాంతమైంది.

TDP Activist Seema Raja Attack People In Kadapa Full Details Here2
మద్యం మత్తులో రెచ్చిపోయిన సీమరాజా.. పోలీసులకే హుకుం!!

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ కోసం సోషల్‌ మీడియాలో అహర్నిశలు పని చేసే సీమరాజా.. ఇప్పుడు అధికారం అండతో రెచ్చిపోతున్నాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి కొందరు అమాయకులపై దాడి చేశాడు. పైగా వాళ్ల మీదనే గంజాయి కేసు పెట్టాలంటూ ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సీమరాజా మరికొందరు ఫుల్‌గా మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. చిట్వేలి మండలం గొల్లపల్లిలో కారు హరన్‌ కొడుతున్నా తప్పుకోలేదని కోపంతో ఊగిపోతూ కొందరు యువకులపై అంతా కలిసి దాడికి దిగారు. ఆపై ఆ యువకులను నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు లాక్కెల్లి వాళ్లపై గంజాయి కేసులు పెట్టాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశాడు. తమ తప్పేం లేకున్నా తమపై దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు.తాను వైఎస్సార్‌సీపీవాడినంటూ వెటకారపు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెంచుకున్నాడు సీమరాజా. నెమ్మదిగా ముసుగు తొలగించి తాను పని చేసేది టీడీపీ కోసమేనని తన వీడియోలతో క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక కూడా ఇష్టానుసారం రెచ్చిపోతున్నాడు. మరోవైపు సీమరాజాతో పాటు కిర్రాక్‌ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు మే మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు.

Bengaluru Incident Turns Political War3
బెంగళూరు ఘటన: అల్లు అర్జున్‌ ప్రస్తావన! విమర్శలపై కాంగ్రెస్‌ సర్కార్‌ ఏమందంటే..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ తొక్కిసలాట ఘటన.. రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని, డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రతిగా కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది.బెంగళూరు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్‌ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజా ఘటనలో ఎవరిని అరెస్ట్‌ చేస్తారంటూ సోషల్‌ మీడియాలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి శోభా కరెంద్లాజె(Shobha Karandlaje) కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పుష్ఫ చిత్రం సమయంలో థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోతే.. సినీ నటుడు అల్లు అర్జున్‌ను ఇంటికెళ్లి మరీ అరెస్ట్‌ చేశారు. పొరుగున్న ఉన్న రాష్ట్రం(తెలంగాణ)లో ఉన్నది మీ ప్రభుత్వమే కదా!. అలాంటిది ఇక్కడ 11 ప్రాణాలు పోయినా పట్టించుకోరా?. ఘటనకు బాధ్యత వహిస్తారు సీఎం సిద్ధరామయ్యా?, డిప్యూటీ సీఎం శివకుమారా?.. ఎవరిని అరెస్ట్‌ చేస్తారు?. ఇద్దరూ తక్షణమే రాజీనామా చేయాలి. ఘటనలో ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం ఉంది. ఎంక్వైరీ కోసం మెజిస్ట్రేట్‌ ఎంక్వైరీకి ఆదేశించారట. జిల్లా స్థాయి అధికారిని నియమించడం ఏంటి?. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని డిమాండ్‌ చేశారామె.VIDEO Credits: NEWS18 KannadaNews18 Kannadaమరోవైపు ఈ అంశంపై కర్ణాటక బీజేపీ నేతలు గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. విధాన సౌధలోనే ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానం చేయాల్సిన అవసరం ఏంటి?. అనుమతి లేదని చెప్పి అక్కడే ఎందుకు నిర్వహించారు. ఆర్సీబీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అత్యాశా ఫలితమే ఈ తొక్కిసలాట. ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. డీకే శివకుమార్‌ను అరెస్ట్‌ చేయాలి అని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రతీ విషయంలో కేంద్రాన్నిప్రశ్నించే రాహుల్‌ గాంధీ..ఈ అంశంపై ఎందుకు మాట్లాడరు అని ఎంపీ సంబీత్‌ పాత్రా ప్రశ్నించారు. అయితే.. బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆ పార్టీవి డర్టీ పాలిటిక్స్‌ అని డీకే శివకుమార్‌ అన్నారు. తల్లిదండ్రులకు శోకం మిగిలిందంటూ కంటతడి పెట్టారు. మరోవైపు సిద్ధరామయ్య సైతం బీజేపీపై మండిపడ్డారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోతే బీజేపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 50 నుంచి60 మంది చనిపోయారు. అప్పుడు మేం ఏమైనా అన్నామా? సిద్ధరామయ్య అన్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆర్సీబీ ప్రాంచైజీనే హడావిడిగా సంబురాలు ఏర్పాటు చేసుకుందని ప్రకటించారు హోంమంత్రి పరమేశ్వర ప్రకటించడం గమనార్హం. ఇక.. ఈ ఘటనపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది.తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాధ్యులు ఎవరనేది మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించలేదు. ఘటనపై దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. మరోవైపు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు విచారణ జరపనుంది.

NRI News: Indian Students Did This For American Visas On Social Media4
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్‌ మీడియా అకౌంట్లను డిలీట్‌ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్‌ క్యాంపస్‌లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, లింక్డిన​, టిక్‌టాక్‌ ఇలా ఇతర ఫ్లాట్‌ఫారమ్‌లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్‌నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్‌ జోక్స్‌ దాకా వేటిని తమ టైం లైన్‌లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్‌ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

KSR Comment: No Pandaga For AP People Expect These Three5
ఏపీలో ఆ పండగేదో వీళ్లకు మాత్రమే! మరి జనాలకు..?

ఏడాదికాలంగా ఏపీ ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందని వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు చేపడితే.. కూటమి నేతలు , ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రంలో ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. ఎవరు సత్యం చెబుతున్నారు? ఎవరు అసత్యం చెబుతున్నారు?. ఈ ఏడాదికాలంగా జరిగిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది వాస్తవం అని ఆధారసహితంగా కనిపిస్తోంది. అదే టైంలో ప్రజలకు పండగ కాదు కాని.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్‌ కల్యాణ్‌లకు మాత్రం పండగే అని ఒప్పుకోవాలి. ఈ ముగ్గురితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర కూటమి నేతల అక్రమ సంపాదనకు రహదారి వేసిందని కూడా అంగీకరించాలి. అందువల్ల వీరికి కూడా పండగే అని చెప్పుకోవాలి. ఏ మాటకు ఆ మాట.. ఎల్లోమీడియా పంట కూడా బ్రహ్మాండంగా పండుతోంది. వారి సంపాదనకు తిరుగులేదు కనుక వారికే పండగే!. కూటమి నేతలుకాని, ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి నిర్దిష్టంగా ఫలానా కారణాల వల్ల ప్రజలు పండగ జరుపుకుంటారని చెప్పలేకపోతున్నారు. అందుకే గత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ముందుగా ఏ రకంగా ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడించిందో విశ్లేషిద్దాం.ఏపీలో తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ తో పాటు భారీ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రకటించారు. ఆ ప్రకారం తాము అమలు చేశామని వీరు ఎక్కడైనా చెప్పగలరా?. వృద్దాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచిన మాట మాత్రం వాస్తవం. కానీ అదే సమయంలో లక్షల పెన్షన్‌లు కోత పెట్టింది నిజమే కదా!. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఇస్తామని చెప్పి ఒక్కటి మాత్రం ఇచ్చారు. అది కూడా అందరికి అందలేదన్నది నిజం. ఈ రెండూ తప్ప ఫలానా ఘన కార్యాలు సాధించామని కూటమి నేతలు కాని, ఎల్లో మీడియా కాని చెప్పలేకపోతోంది. అందుకే సోషల్ మీడియాలో కూటమి వాగ్దానాలపై వ్యంగ్య పాటలు, వ్యాఖ్యలు భారీగా కనిపిస్తున్నాయి.సూపర్ సిక్స్ లో బాగంగా యువతకు నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఇచ్చారా?లేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడపీకారు. జగన్ టైంలో ఏర్పర్చిన వలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని.. పైగా పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారా?లేదా?. అధికారంలోకి వచ్చాక.. ఏవో దొంగ కారణాలు చూపుతూ ఆ వ్యవస్థకు మంగళం పాడారా?లేదా?. దాంతో రెండున్నర లక్షల మందికి గౌరవ వేతనం రాకుండా పోయింది. ఇది యువతకు వెన్నుపోటు పొడిచినట్లే కదా!. జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు,వ్యవస్థలు అన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు,పవన్ లు పదే,పదే ప్రకటించారు. కాని పవర్ వచ్చిన వెంటనే ప్రజలకు ఇళ్లవద్దే అందే సేవలను దాదాపు రద్దు చేశారు. చివరికి రేషన్ బియ్యం తదితర సరుకులు అందించే వాహనాలను కూడా ఎత్తివేశారు. ఫలితంగా సుమారు ఇరవైవేల మంది వాహన నిర్వాహకులు, వారి కుటుంబాలు వీధినపడ్డాయి. రేషన్ కోసం ప్రజలు ముఖ్యంగా పేదలు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడి ఉండాల్సి వస్తోంది. ఇది వెన్నుపోటు కాదా!. అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయల చొప్పున జగన్ ఇస్తుంటే.. చంద్రబాబు ఏమని అన్నారు. జగన్ ఒక్క విద్యార్దికే ఇస్తున్నారు..అది అన్యాయం.తాము వస్తే ప్రతి విద్యార్ధికి పదిహేనువేల చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామని అన్నారు. జనం అమాయకంగా నమ్మారు. కాని అధికారం వచ్చి ఏడాది అయినా దాని అతీగతి లేదు. ఈ జూన్ లో ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారు. కాని ఇప్పటికే ఒక ఏడాది ఎగవేశారు కదా?ఇది వెన్నుపోటే కదా!. ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.ఇది వెన్నుపోటే కదా!అలాగే మహిళలకు ఉచిత బస్, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయలు ఇస్తామని చెప్పారు. అదీ జరగలేదు. దీనిని వెన్నుపోటు కాదని అనగలరా?. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ సకాలంలో చెల్లించి వారి సర్టిఫికెట్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేశారు?. ఉచిత ఇసుక విధానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా?. ఇసుకను కూటమి నేతలకు ఆదాయవనరుగా మార్చడం ప్రజలకు వెన్నుపోటా ?కాదా?. పండగ కానుకలు వస్తాయని, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ అని, పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇస్తామని, ఇలా ఒకటేమిటి! చేతికి ఎముక లేని చందంగా చంద్రబాబు పధకాలు అమలు చేస్తారేమోలే అని భావించిన ప్రజలకు అవేవి చేయకపోవడం వెన్నుపోటు అవ్వదా?. అసలే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటులో సిద్దహస్తుడు అనే పేరు ఉంది. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పటి నుంచి ఆయన ప్రత్యర్ధులు ఈ విషయాన్ని తరచూ చెబుతుంటారు. 2014-2024లలో ఆయనకు పవన్ కల్యాణ్‌ కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి హామీల విషయంలో చేసిన వెన్నుపోటు ఒక రకం అయితే.. ప్రభుత్వాన్ని నడపడంలో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు.. నేతలపై కేసులు పెడుతూ రెడ్ బుక్ అంటూ లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అరాచకం మరో ఎత్తుగా ఉంది. జగన్ రూ. 14 లక్షల కోట్ల అప్పు చేశారని అంటూ పచ్చి అబద్దాలు చెబుతూ.. అయినా తాము అన్ని హామీలు అమలు చేస్తామని, సంపద సృష్టించడం తెలుసునని ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని ప్రజలనే అడగడం వెన్నుపోటే అవుతుంది కదా!. ఏకంగా ఏడాదిలో లక్షన్నర కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించడం ప్రజలను మోసం చేసినట్లు కాదా?. తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడం ద్వారా దేవదేవుడిని కూడా వెన్నుపోటు పొడవడానికి వెరవలేదే!. ఇలా ఒకటేమిటి?.. అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సమీకరించి, లక్షల కోట్లు ఆ గ్రామాలలోనే ఖర్చు పెట్టడానికి తయారవుతున్న తీరు చూస్తే ఇతర ప్రాంతాల ప్రజలను వెన్నుపోటు పొడవడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదని అర్దం అవుతుంది కదా!. దీనికన్నా ప్రభుత్వానికి అవసరమైన పదివేల ఎకరాలో, అంతకు కాస్త ఎక్కువో భూమిని మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి ఉంటే లక్షల కోట్లు ఆదా అయ్యేవి కదా అనేదానికి సమాధానం దొరకదు. ఉర్సా వంటి ఊరుపేరులేని కంపెనీలకు విశాఖలో విలువైన భూములు కట్టబెట్టడం ఆ ప్రాంతానికి వెన్నుపోటు అవుతుందా? కాదా?. ఆర్థికంగా బలంగా ఉన్న టీసీఎస్‌ కంపెనీ తనకు లీజుకు భూమి ఇవ్వాలని అడిగితే 99 పైసలకే భూమి అమ్మేస్తామని ఉదారంగా చెప్పడం ప్రజలకు వెన్నుపోటు కాదా!. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోలీసులు కొందరు ఇష్టారాజ్యంగా పెడుతున్న కేసులు బహిరంగంగా చట్టంతో సంబంధం లేకుండా నిందితులను దారుణంగా హింసిస్తున్న వైనం ఇవన్ని వెన్నుపోటుకు బోనస్‌ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన ప్రభుత్వం తమకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ రకంగా కూటమి నేతలకు పండగ అని చూస్తే.. ప్రభుత్వం వచ్చీ రాగానే లక్షల టన్నుల ఇసుకను ఊదేసి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించగలిగారు. అది ఏ స్థాయిలో ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక టీడీపీ కార్యకర్తే జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరుల దందాను అరికట్టాలని కోరుతున్నానని, అలా చేయడానికి లంచం ఇవ్వడానికి కూడా సిద్దమని చెప్పి ,లక్షన్నర రూపాయల ఇవ్వడానికి సిద్దపడ్డారు!. దీనిని ఏమని అనుకోవాలి?. ఈ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది. మద్యం మాఫియా ఎలా విజృభిస్తోందో, లిక్కర్ షాపులలో కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు, ఊరూరా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కూటమి కార్యకర్తలకు పండగే కావొచ్చు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు తమ పదవులను ప్రజాసేవకు కాకుండా తమ ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల దర్జాలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అది వారికి పండగే కదా?. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగితే కనీసం పలకరించకుండా సనాతని వేషం కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పవన్‌కు పండగే కదా?. పైళ్లను భారీగా పెండింగ్ లో పెట్టి, షూటింగ్ లలో కాలం గడుపుతున్న ఆయనను ప్రశ్నించేదెవ్వరు. అందుకే ఆయనకు ఇది పండగే. అమరావతి నిర్మాణాల వ్యయం రెట్టింపు చేసి కాంట్రాక్టర్‌లకు పందెం చేస్తున్నందున వారికి పండగే. టీడీపీ కార్యకర్తల పెండింగ్ అక్రమ బిల్లుల పేరుతో వందల కోట్లను ఇస్తూ పండగ చేసుకోండని చెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ల కన్నా తానే పవర్ ఫుల్ అని రెడ్ బుక్ పాలన చేస్తున్న లోకేష్ కి వీరిద్దరి కన్నా పెద్ద పండగగానే ఈ ఏడాది సాగిందని ఒప్పుకోవాలి. ఏతా వాతా చూస్తే ప్రజలకు వెన్నుపోటు, కూటమి నేతల అక్రమార్జనకు పండగే అని చెప్పొచ్చు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Axiom 4 crew unveiled the missions zero gravity indicator Swan Toy6
ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..

సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్‌ని రాకెట్‌లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్‌కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్‌ని స్పేస్‌ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌కు భారత్‌కి చెందిన శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..ఆక్సియమ్ స్పేస్ మిషన్‌ ఈ నెల జూన్‌ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ లాంఛ్‌ అవుతుంది. ఈ రాకెట్‌ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్‌గా వ్యవహరిస్తారు.ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్‌ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్‌ పేర్కొది. ఇదే ఎందుకంటే..భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్‌లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్‌ కెప్టెన్‌ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ మా మిషన్‌ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక ఈ మిషన్‌ కమాండర్‌ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్‌ రాకెట్‌ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్‌ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్‌లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్‌, హంగేరిలో ఇది దయకు సంకేతం. అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్‌ 4 మిషన్‌ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్‌ 8కి షెడ్యూల్‌ చేశారు. ఆ తర్వాత జూన్‌ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్‌ఎక్స్‌. మిషన్‌ సోవియట్ సోయుజ్ T-11తో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా, సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్‌​ 4 మిషన్‌తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.(చదవండి: భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే..)

Vijay Mallya congratulated RCB on X met with widespread trolling with many users7
ఆర్‌సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్‌బీఐ ట్వీట్‌ వైరల్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్‌సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్‌సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్‌ నిలిచింది. 2025 టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్‌సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్‌ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్‌..’ అంటూ ఒకరు ట్వీట్‌ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్‌కు ఎస్‌బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్‌, భారత్‌కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్‌ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్‌ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్‌బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్‌గా మారుతున్న మాల్యా ట్వీట్‌కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్‌బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్‌ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్‌ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది.

Japanese Baba Vangas Prediction mass Travel Cancellations8
జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్‌

బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్‌లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో ​​టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్‌ కాలజ్ఞాని రియో ​​టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్‌ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో ​​టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్‌లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్‌ సమయంలో 50శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని హాంకాంగ్‌లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్‌ జపాన్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్‌-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’

Hina Khan wedding with boyfriend celebrity mehendi artist 'Henna' goes viral 9
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్‌ ఎట్రాక్షన్

ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్‌బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్‌ ఫ్రెండ్‌ రాకీ జైస్వాల్‌ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్‌ లుక్‌లో తన అభిమానులకు సరప్రెజ్‌ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్‌బర్డ్స్‌కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్‌ గురించి ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్‌ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్‌ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్‌ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్‌ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్‌ వావ్‌ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్‌ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్‌ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్‌ డిజైన్‌సహా ఆమె డిజైన్స్‌ ట్రెండ్‌గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్‌ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు.

Kamal Haasan Thug Life Movie Twitter Review In Telugu10
కమల్‌ హాసన్‌ థగ్ లైఫ్‌.. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్‌ కమల్‌ హాసన్ నటించిన తాజా చిత్రం 'థగ్‌ లైఫ్‌'. ఈ మూవీకి మణిరత్న దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు జతకట్టారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ హాఫ్‌ సూపర్‌ ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. మణిరత్నం డైరెక్ష‍న్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఈసినిమాలో కమల్ హాసన్ లుక్‌ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు. మరికొందరేమో ఇండియన్‌-2 కంటే వరస్ట్‌గా ఉందని.. కమల్ హాసన్ ఫర్మామెన్స్‌ అస్సలు బాగాలేదని పోస్ట్ చేశారు. శింబు రోల్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని.. కథ చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. థగ్ లైఫ్‌ సినిమాలో కమల్‌ నటన బాగానే ఉందని.. కానీ అతని నాన్ స్టాప్ డైలాగ్స్ బోరింగ్‌గా అనిపించాయని ఓ నెటిజన్స్‌ ట్వీట్ చేశారు. శింబు తన పాత్రను చక్కగా చేశాడు.. కానీ అది కూడా చాలా నార్మల్‌గా ఉందని.. సాగే సెకండ్ హాఫ్ స్లోగా ఉండడంతో బోరింగ్‌గా ఉందంటూ..ఈ చిత్రంలో మణిరత్నం స్పార్క్ కనిపించలేదని పోస్ట్ చేశాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం లేదు. #ThugLife had potential but turns into a drag. Kamal acted well, but his nonstop dialogues get tiring. Simbu did his role neatly, but even that couldn’t save the flat, slow-paced second half. No Mani Ratnam spark.Below average 👍#ThugLife #KamalHaasan #ThugLifeFDFS pic.twitter.com/I5wQlxoBO7— The Flicks (@Flicks_rithick) June 5, 2025 #ThugLifeReview Kindly tighten the security & don’t let him enter this street, if he is coming with a story for a new movie.🙏 #ThugLife pic.twitter.com/8n9QZyWd8D— Kingsley (@CineKingsley) June 5, 2025 #ThugLife Mani sir what were u thinking? Worse than #Indian2 #KamalHaasan𓃵 is aged and gives the weakest perf. #SilambarasanTR is wasted in a role with 0 scope. #Trisha is in a dummy role. Slow boring and hard to sit through this bad gangster drama. Semma mokka! 1.25/5 pic.twitter.com/tPQkbHaFB4— AllAboutMovies (@MoviesAbout12) June 5, 2025 #FDFS Never Miss!! #KamalHaasan𓃵 So it Beginsssss 😘♥️ #ThugLife #Malaysia ♥️ pic.twitter.com/pdWBRCuAZQ— 𝓡𝓲𝓓𝓓𝓲𝓜 (@RiDDiM04) June 5, 2025 Thug life review: first half 🇨🇦 - super engaging 🏆🏆Mani ratnam aesthetics >>>>>🧨🧨🧨🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩Hoping for a better second half .Mani ratnam is the Hayao Miyazaki of Indian Cinema ✨✨✨❤️❤️#ThugLife #KamalHaasan𓃵 #ThugLifeBlockbuster #Thuglifereview pic.twitter.com/UtFcICxImv— juice9 (@Georgej39718648) June 5, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement