విశ్వ విజేత టీమిండియా ఇవాళ (జులై 4) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా మోదీ భారత బృందాన్ని అభినందించారు. పీఎం మోదీ భారత క్రికెటర్లకు ఆల్పాహార విందు ఏర్పాటు చేశారు. మోదీ అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది ముచ్చటించారు.
TEAM INDIA MEETS PM NARENDRA MODI. 🇮🇳pic.twitter.com/tCotFhi4QP
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
అనంతరం భారత బృందం ప్రధాని నివాసం నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారు. ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.
కాగా, ఇవాళ ఉదయమే భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. హరికేన్ (గాలివాన) కారణంగా భారత బృందం మూడు రోజుల పాటు బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు భారత బృందం ఇవాళ తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.
ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్ ట్రోఫీ) సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment