
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 37 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.
ఐసీసీ వరల్డ్‌కప్(వన్డే అండ్ టీ20)లలో 3000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లలో కోహ్లి 3002 పరుగులు చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లలో 37 మ్యాచ్‌లు ఆడి 1795 పరుగులు చేసిన కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్‌లలో 32 మ్యాచ్‌లు ఆడి 1207 పరుగులు చేశాడు.