2nd ODI vs SA: గత ఏడాదిని భారీ టెస్టు విజయంతో ఘనంగా ముగించిన భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది ఇంకా గెలుపు బోణీ కాలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడటంతోపాటు తొలి వన్డేలో కూడా టీమిండియా చిత్తయింది. టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి వన్డే జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా నిర్వ హిస్తుండగా... ఇరు జట్లూ మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తుది ఫలితంలో ఏమైనా మార్పు ఉంటుందా లేక భారత్ వన్డే సిరీస్‌నూ అప్పగిస్తుందా చూడాలి.
వెంకటేశ్‌కు మరో చాన్స్!
తొలి వన్డేలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యూహాలు ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంటూ తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌తో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ముఖ్యంగా బవుమా, డసెన్ జోడీని విడగొట్టడంలో ప్రధాన బౌలర్లంతా విఫలమైనప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. బౌలింగ్ చేయనప్పుడు వెంకటేశ్‌కంటే రెగ్యులర్ బ్యాటర్ సూర్యకుమార్ సరైన ప్రత్యామ్నాయమని అనిపించింది. అయితే ఒక్క అరంగేట్రం మ్యాచ్‌తోనే వెంకటేశ్‌ను పక్కన పెట్టే అవకాశాలు తక్కువ. అతనికి మరో చాన్స్ లభించవచ్చని తెలుస్తోంది.
సుదీర్ఘ కాలంగా టాప్–3 ప్రదర్శనతోనే విజయాలు దక్కించుకున్న భారత్‌కు మళ్లీ మిడిలార్డర్ సమస్యగా మారింది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ కూడా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు ఉంటాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా కూడా రాహుల్‌కు ఇది కీలక మ్యాచ్ కానుంది. మరోవైపు తొలి వన్డేలో గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇదే జోరులో మరో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. టాప్–6లో మార్క్‌రమ్ మినహా అంతా ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్క్‌రమ్ ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. ఆపై ఫెలుక్‌వాయో, జాన్సెన్ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉన్నారు. చిన్న బౌండరీలు ఉన్న ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం.
చదవండి: క్రికెట్ అభిమానులుకు గుడ్ న్యూస్.. పాకిస్తాన్‌తో భారత్ తొలిపోరు
Comments
Please login to add a commentAdd a comment