India vs South Africa ODI: Yuzvendra Chahal requires one wicket to become highest wicket taker - Sakshi
Sakshi News home page

SA vs IND: అరుదైన రికార్డుకు చేరువ‌లో చాహల్.. తొలి బౌల‌ర్‌గా

Published Sun, Jan 23 2022 12:55 PM | Last Updated on Sun, Jan 23 2022 1:10 PM

Yuzvendra Chahal requires one wicket to become highest wicket taker in India vs South Africa ODIs - Sakshi

India vs South Africa ODI: ద‌క్షిణాఫ్రికాతో టెస్టు, వ‌న్డే సిరీస్‌ల‌ను కోల్పోయిన టీమిండియా అఖ‌రి పోరుకు సిద్ద‌మైంది. కేప్‌టౌన్ వేదికగా ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న చివ‌రి వ‌న్డేలోనైనా గెలిచి  పరువు నిలుపుకోవాలని భార‌త్‌ భావిస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త స్సిన్న‌ర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో చాహల్ ఒక్క వికెట్ సాధిస్తే దక్షిణాఫ్రికా గడ్డ‌పై ప్రోటిస్ జట్టుపై అత్య‌ధిక వికెట్ల ప‌డ‌గొట్టిన బౌల‌ర్‌గా నిలుస్తాడు.

కాగా ఇప్పటికే 17 వికెట్లు ప‌డ‌గొట్టిన చాహల్.. కుల్దీప్ యాదవ్ (17)తో స‌మానంగా నిలిచాడు. అదే విధంగా మ‌రో రెండు వికెట్లు సాధిస్తే.. వ‌న్డేల్లో 100 వికెట్ల క్ల‌బ్‌లో చాహ‌ల్ చేరుతాడు. ఇక టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో  3000 పరుగుల క్ల‌బ్‌లో చేర‌డానికి 12 ప‌రుగుల దూరంలో నిలిచాడు.

చ‌ద‌వండి: Ind Vs Sa 3rd ODI: ధావన్‌కు విశ్రాంతి.. ఓపెనర్‌గా వెంకటేశ్‌.. భువీ వద్దు.. అతడే కరెక్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement