
South Africa vs India, 3rd ODI: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాష్రికాతో అఖరి వన్డేలో ఆదివారం భారత్ తలపడనుంది. ఇప్పటికే రెండు వన్డే్ల్లో ఓటమి చెంది సిరీస్‌ను భారత్ కోల్పోయింది. టీమిండియా కనీసం చివరి వన్డేలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. కాగా రెండు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్‌గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్‌కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. అయితే చివరి మ్యాచ్‌లో భారత జట్టులో కీలక మార్పులు చేయున్నట్లు తెలుస్తోంది.
తొలి రెండు వన్డేల్లో విఫలమైన భువనేశ్వర్ కూమార్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి .. అతడి స్ధానంలో సూర్యకూమార్ యాదవ్ ఎంపిక చేసే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలి రెండు వన్డేల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఒక వేళ శ్రేయస్ అయ్యర్ దూరమైతే అతడి స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు.
చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా?
Comments
Please login to add a commentAdd a comment