పార్ల్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటిస్ జట్టు కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయంలో ఓపెనర్లు మలాన్, డికాక్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఓపెనింగ్ వికెట్‌కు 132 పరుగులు జోడించారు. మలాన్ 91 పరుగులు చేయగా, డికాక్ 78 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ప్రోటిస్ ఓపెనర్ జననేమన్ మలన్ ప్రపంచ రికార్డు సాధించాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 700 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మలన్ నిలిచాడు. మలన్ 12 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా, నెదర్లాండ్ ఆటగాడు టామ్ కూపర్ 13 ఇన్నింగ్స్‌లో 700 పరుగులు చేశాడు. ఇక టెస్ట్, వన్డే సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. కేప్ టౌన్ వేదికగా జనవరి 23న జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
చదవండి: హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు!
Comments
Please login to add a commentAdd a comment