సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత్ పేస్ విభాగం అద్భుతంగా ఉంది అని అతడు కొనియాడాడు. "ప్రపంచ స్థాయి అద్బుతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు.
ఇటీవల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు విజయం సాధించింది. ఈ పర్యటనల్లో బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక భారత బౌలింగ్ విభాగం అద్భుతమైనది. అదే విధంగా టెస్ట్‌ల్లో భారత్ విజయాల్లో జట్టు పేస్ బౌలింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచస్ధాయి బ్యాటర్లను కూడా బోల్తా కొట్టించే బౌలర్లు భారత జట్టులో ఉన్నారు. అనుభవజ్ఞులైన పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ ఉండడం జట్టుకు మరింత బలం చేకూరుతుంది" అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా 2018లో సౌతాఫ్రికా పర్యటనలోనే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్‌ల్లో ఆరంగట్రేం చేశాడు.
చదవండి: IPL 2022 Auction: 39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది
Comments
Please login to add a commentAdd a comment