
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వెన్ను నొప్పి కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అఖరి నిమిషంలో తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో విరాట్ స్ధానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో తిరిగి ఫిట్‌నెస్ సాధించాడనికి నెట్స్‌లో విరాట్ చెమటోడ్చుతున్నాడు. కాగా విరాట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ త్రోడౌన్ బౌలింగ్ చేస్తుండగా కోహ్లి ఆడుతున్నాడు. కాగా జనవరి 11నుంచి కేప్ టౌన్‌లో ప్రారంభం కానున్న అఖరి టెస్ట్‌లో కోహ్లి ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కోహ్లి కేప్ టౌన్ టెస్ట్‌లో ఆడితే విరాట్ కెరీర్‌లో 99వ టెస్టు మ్యాచ్ అవుతుంది. ఇక జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ విషయానికి వస్తే భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి.
చదవండి: SA vs IND 2nd Test: ఓటమి దిశగా భారత్.. విజయానికి 122 పరుగుల దూరంలో దక్షిణాఫ్రికా!
Kohli receiving throwdowns from Dravid pic.twitter.com/uY3h8cd8Fj
— Benaam Baadshah (@BenaamBaadshah4) January 5, 2022