భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌! | KL Rahul named Vice Captain for Test Series in Rohit Sharmas Absence Says Reports | Sakshi
Sakshi News home page

IND Vs SA: భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌!

Published Sat, Dec 18 2021 3:12 PM | Last Updated on Sat, Dec 18 2021 4:16 PM

KL Rahul named Vice Captain for Test Series in Rohit Sharmas Absence Says Reports - Sakshi

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు  భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్‌ స్ధానంలో రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా దీనిపై బీసీసీఐ అధికారికంగా ఇంకా ప్రకటన చేయవలసి ఉంది.

"రోహిత్‌ గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌ను ఎంపిక చేశాం" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దక్షిణాప్రికాకు చేరుకున్న టీమిండియా క్వారంటైన్‌ పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.ఇక సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌ 26న దక్షిణాఫ్రికా- భారత్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది.

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

చదవండి: IPL 2022: "నాకు ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలని ఉంది"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement