భారత్-దక్షిణాప్రికా రెండో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో దూరమయ్యాడు. కోహ్లి స్ధానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. టాస్ సందర్బంగా రాహుల్ మాట్లాడూతూ.." దురదృష్టవశాత్తూ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం విరాట్‌ని వైధ్యులు పర్యవేక్షిస్తున్నారు.
అతడు మూడో టెస్ట్‌కు గాయం నుంచి కోలుకుంటాడని భావిస్తున్నాను. తన దేశానికి కెప్టెన్‌గా ఉండాలని అనుకోవడం ప్రతీ ఒక్క ఆటగాడికి కల. ఈ సవాల్‌ను ఎదర్కొవడానికి సిద్దంగా ఉన్నాను. విరాట్ స్ధానంలో హనుమా విహారి జట్టులోకి వచ్చాడు. తొలి టెస్ట్‌లో అద్భుతంగా రాణించాము. జోహన్స్‌బర్గ్‌లో కూడా అదే జోరు కోనసాగించాలని భావిస్తున్నాము" అని రాహుల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment