Test captain Virat Kohli
-
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఇది ప్రతి ఆటగాడి కల!
భారత్-దక్షిణాప్రికా రెండో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చివరి నిమిషంలో దూరమయ్యాడు. కోహ్లి స్ధానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. టాస్ సందర్బంగా రాహుల్ మాట్లాడూతూ.." దురదృష్టవశాత్తూ కోహ్లి వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం విరాట్‌ని వైధ్యులు పర్యవేక్షిస్తున్నారు. అతడు మూడో టెస్ట్‌కు గాయం నుంచి కోలుకుంటాడని భావిస్తున్నాను. తన దేశానికి కెప్టెన్‌గా ఉండాలని అనుకోవడం ప్రతీ ఒక్క ఆటగాడికి కల. ఈ సవాల్‌ను ఎదర్కొవడానికి సిద్దంగా ఉన్నాను. విరాట్ స్ధానంలో హనుమా విహారి జట్టులోకి వచ్చాడు. తొలి టెస్ట్‌లో అద్భుతంగా రాణించాము. జోహన్స్‌బర్గ్‌లో కూడా అదే జోరు కోనసాగించాలని భావిస్తున్నాము" అని రాహుల్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్.. -
ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి
కాన్పూర్: ఇటీవల ఉడీ సెక్టార్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ఇలాంటి పిరికి చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరి మనసును గాయపరుస్తాయని అన్నాడు. ‘నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. సైనికుల కుటుంబాల గురించి ఆలోచిస్తే ఆవేదనగా ఉంది. ఓ భారతీయుడిగా ఈ దుర్ఘటనలో నష్టపోరుున కుటుంబాలకు సానుభూతి తెలుపుతు న్నాను’ అని కోహ్లి తెలిపాడు. -
ఫామ్‌పై ఆందోళన లేదు
ఎప్పుడూ బాధ్యతగానే ఆడాను టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య చెన్నై: ఇటీవలి కాలంలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి నుంచి అభిమానులు ఆశిస్తున్న మెరుపులు లేవన్నది నిజం. గతేడాది ఆసీస్ పర్యటనలో బాగానే రాణించినా ఆ తర్వాత మాత్రం తన బ్యాట్ ద్వారా అందరినీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’పై కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అయితే తన ఫామ్‌పై మాత్రం ఎలాంటి ఆందోళన లేదని ఈ టెస్టు కెప్టెన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు కోసం తానెప్పుడూ బాధ్యతగానే ఆడినట్టు గుర్తుచేశాడు... మున్ముందు కూడా సహజ శైలి లోనే ఆడతానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది భారత టెస్టు జట్టు ఎక్కువగా మ్యా చ్‌లు ఆడకున్నా... వన్డేల్లోనూ అతడి ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరిలో చివరి శతకం సాధించాడు. తన బ్యాటింగ్ వైఫల్యంతో పాటు రాబో యే శ్రీలంక పర్యటన గురించి కోహ్లి చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే.... ప్రతిసారీ నూరుశాతం: ఓ బ్యాట్స్‌మన్‌గా నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఆడాను. ప్రతిసారీ జట్టు గెలుపు కోసమే నూటికి నూరు శాతం ప్రయత్నించాను. అందుకే నా బ్యాటింగ్ మెరుగుకు అదనపు కృషి చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడి కోచింగ్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు ఆడడంతో నాకు మంచి శిక్షణ లభించినట్టయ్యింది.దూకుడే బలం: ఫామ్‌ను అందుకోవడానికి నా దూకుడైన బ్యాటింగ్‌ను మార్చుకోవాలని అనుకోవడంలేదు. వాస్తవానికి దూకుడే బోర్డు నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు కారణమని అనుకుంటున్నాను. లంక పర్యటన: శ్రీలంక పర్యటన నా కెప్టెన్సీలో తొలి పూర్తిస్థాయి టెస్టు సిరీస్. అందుకే చాలా ఉద్వేగంగా ఉంది. జట్టు ఆటగాళ్లు సరైన దృక్పథంతో ఆడితే లంకలో విజయం సాధిస్తాం.పేసర్లూ కీలకమే: ఓపెనర్‌గా మురళీ విజయ్ జట్టుకు నిలకడైన ఆరంభాలను అందిస్తున్నాడు. అశ్విన్, మిశ్రాలతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ ఆలోచనలు జట్టుకు ఉపయోగపడతాయి. అలాగే పేసర్లు కూడా లంక పర్యటనలో కీలకం కానున్నారు. -
అందరి దృష్టి కోహ్లిపైనే
భారత్, ఆసీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు లోకేశ్ రాహుల్, మిశ్రా, ఉమేశ్‌లకు విశ్రాంతి చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అద్భుతంగా ఆడినా తొలి టెస్టు డ్రాగా ముగియడంతో కాస్త నిరాశ చెందిన భారత్ ‘ఎ’ జట్టు... రెండో అనధికార టెస్టు కోసం సిద్ధమైంది, నేటి నుంచి చెన్నైలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే నెలకొంది. వచ్చే నెలలో భారత్... శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో చెన్నై, కొలంబో వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఒకే రకంగా ఉండనుండటంతో ఈ మ్యాచ్‌తో ఫామ్‌లో రావాలని విరాట్ భావిస్తున్నాడు. సోమవారం జరిగిన భారత జట్టు ప్రాక్టీస్‌లోనూ అతను పాల్గొన్నాడు. మందకొడి పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డ ఆసీస్ తొలి మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కింది. అయితే రెండో టెస్టులో మంచి పిచ్ లభిస్తుందని ఆశిస్తున్న ఇరుజట్ల కెప్టెన్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. తుది జట్టులో కోహ్లి ఉండనుండటంతో గత మూడు రోజులుగా మైదానం సిబ్బంది వికెట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ మ్యాచ్‌లో లోకేశ్ రాహుల్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. కెప్టెన్ పుజారా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. బ్యాటింగ్‌లో విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్లు మంచి సమన్వయంతో ఆడుతుండటం కలిసొచ్చే అంశం కాగా... కరుణ్ నాయర్, నమన్ ఓజా, అభినవ్ ముకుంద్‌లు గాడిలో పడాల్సి ఉంది. స్పిన్నర్లలో ప్రజ్ఞాన్ ఓజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పేసర్లు కాస్త విజృంభిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. మరోవైపు ఆసీస్ బ్యాటింగ్ కంటే బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా కనిపిస్తోంది. నాణ్యమైన పేస్ అటాకింగ్‌తో పాటు స్పిన్నర్ స్టీఫెన్ ఓ కీఫీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో శుభారంభం ఇవ్వడంలో విఫలమైన ఆసీస్ ఈ మ్యాచ్‌లో దాన్ని పునరావృతం కాకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.