SA Vs IND ODI 2022: Virat Kohli To Skip ODI Series Injury, Report Says - Sakshi
Sakshi News home page

SA vs IND: టీమిండియాకు భారీ షాక్‌.. వన్డే సిరీస్‌కు కోహ్లి దూరం!

Published Tue, Jan 4 2022 7:54 AM | Last Updated on Tue, Jan 4 2022 4:09 PM

Virat Kohli To Skip ODI Series Against Proteas Following Injury, Says Report - Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు టెస్ట్‌ అఖరి నిమిషంలో వెన్ను నొప్పి కారణంగా కోహ్లి తప్పుకున్నాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్‌ రాహల్‌ కెప్టెన్పీ బాధ్యతలు చేపట్టాడు. కాగా టాస్‌ సమయంలో మాట్లాడిన రాహుల్‌.. ప్రస్తుం కోహ్లి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడాని, త్వరగా కోలుకుంటాడని తెలిపాడు.

కాగా అంతకుముందు వ్యక్తిగత కారణాలతో కోహ్లి వన్డే సిరీస్‌ నుంచి తప్పకోనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో కోహ్లి ఉన్నాడు. కాగా మరోసారి వన్డేలకు కోహ్లి అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా టీమిండియా పరిమిత ఓవర్లు కెప్టెన్‌ రోహత్‌ శర్మ కూడా గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. ఇక భారత్‌-దక్షిణాఫ్రికా తొలి వన్డే జనవరి19న జరగనుంది.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), చహల్‌, ఆర్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌

చదవండి: SA vs IND: రాహుల్‌కి వార్నింగ్‌ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement