
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి ఫిట్‌నెస్ సాధించాడనికి కష్టపడుతున్నాడు. హార్ధిక్ ప్రస్తుతం ముంబైలోని రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెమటోడ్చుతున్నాడు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత హార్ధిక్.. అంతగా రాణించలేక పోతున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021, టీ20 ప్రంపచకప్‌లోను హార్ధిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు.
2021 ఏడాదికు గాను ఆరు వన్డేలు ఆడిన హార్ధిక్ కేవలం 165 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే..11టీ20లు ఆడిన 165 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు సెలక్షన్‌లోకి తనని పరిగణలోకి తీసుకోవద్దు అని అతడే స్వయంగా సెలెక్టర్లుని కోరాడు. ఇక పూర్తి స్ధాయిలో ఫిటెనస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తాను అని హార్ధిక్ తెలిపాడు. ఈ క్రమంలో పాండ్యా విజయ్ హజారే ట్రోఫీ నుంచి కూడా తప్పుకున్నాడు. కాగా పాండ్యా తాజాగా తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టొరీలో షేర్ చేశాడు.
చదవండి: Ravichandran Ashwin: ధోని ఈజ్ బెస్ట్, తర్వాత ఆ ఇద్దరు.. అశ్విన్ లిస్ట్‌లో పంత్‌కి నో ప్లేస్
Comments
Please login to add a commentAdd a comment