దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్‌కి అప్పగించారు. అదే విధంగా వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాని చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానల్ నియమించింది. అయితే జట్టులో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్‌ను కానీ,శ్రేయస్ అయ్యర్‌ని ఎంపిక చేస్తారని అంతా భావించారు.
అయితే సెలెక్టర్లు మాత్రం బుమ్రావైపే మెగ్గు చూపారు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా బుమ్రాను నియమించడం పట్ల భారత మాజీ క్రికెటర్ సబా కరీం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయ్యర్, పంత్‌ను కాకుండా బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమిస్తారని అసలు నేను ఊహించలేదు అని కరీం తెలిపాడు.
"నేను ఈ విషయం విని చాలా ఆశ్చర్యపోయాను, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ అవుతాడని నేను ఊహించలేదు. రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అతడు మూడు ఫార్మాట్‌లను ఆడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ అద్భుతంగా రాణించాడు. పంత్‌కి కెప్టెన్సీపై అవగాహన ఉంది. బుమ్రాకు ఇప్పటి వరకు కెప్టెన్‌గా చేసిన అనుభవం లేదు"అని సబా కరీమ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment