భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్‌లో సరి కొత్త రికార్డును సృష్టించాడు. భారత్ తరుపున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ డెర్ డస్సెన్‌ని ఔట్ చేసిన బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును బుమ్రా కేవలం 43 ఇన్నింగ్స్‌లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా మొత్తంగా 105 వికెట్లు పడగొట్టాడు.
అయితే బుమ్రా సాధించిన 105 వికెట్లలో 101 విదేశాల్లోనే పడగొట్టడం గమనర్హం. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బుమ్రా అదరగొడుతున్నాడు. కీలక సమయంలో వాన్ డెర్ డస్సెన్, కేశవ్ మహారాజ్‌లను పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిపాడు. కాగా బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను 2018లో దక్షిణాఫ్రికాలోనే ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment