ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. జోహన్స్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికా ఖాతాలో 12 పాయింట్లు వచ్చి చేరాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రోటాస్ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక భారత్ జట్టు 4 స్ధానంలో నిలిచింది.
కాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడు వరుస విజయాలతో 36 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక జట్టు 24 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 36 పాయింట్లతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. వెస్టిండీస్ 7వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 8వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ జట్టు చివరి స్థానంలో ఉంది.
చదవండి: ఎల్గర్ మళ్లీ ఆ తప్పు చేయలేదు.. టీమిండియాకు చేజారిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment