జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పోరాడతోంది. అయితే మూడో రోజు తొలి సెషన్‌లో భారత్ అధిపత్యం చెలాయించింది. అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా అర్ధసెంచరీలు సాధించి కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే భారత్ వరుస క్రమంలో రహానే, పుజారా వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌పై అంతా ఆశలు పెట్టుకున్నారు. కాగా పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్లెడ్జ్ంగ్ చేశాడు.
అయితే వెంటనే పంత్ దానికి బదులుగా నోరు అదుపులో పెట్టుకోమని డస్సేన్‌ని హెచ్చరించాడు. ఈ క్రమంలో అసహానానికి గురైన పంత్.. రబాడ బౌలింగ్‌లో నిర్లక్షమైన షాట్ ఆడుతూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కాగా జట్టు కష్ట పరిస్ధితుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పంత్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు పడగొట్టాలి.
చదవండి: SA vs IND: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
"Rishabh Pant" : Keep your mouth shut.
— Aman 🍀 (@lazyafguy) January 5, 2022
**And got out on 3rd ball🥺** #SAvIND pic.twitter.com/DJZPoV4xZ9
Comments
Please login to add a commentAdd a comment