
దక్షిణాఫ్రికా పర్యటనలలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియాన్ వేదికగా తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ భారత్ గెలవలేదు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సేన తొలి సిరీస్ కైవసం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రోటాస్ మాజీ పేసర్ ముఖాయ ఎన్తిని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా అత్యుత్తమ టెస్టు జట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని, కానీ స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము అని అతడు తెలిపాడు.
“ప్రస్తుతం భారత్ అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగహన ఉంది. మా జట్టులో డీన్ ఎల్గర్, టెంబా బావుమా వంటి ఆద్బుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా వాన్ డెర్ డుస్సెన్ రూపంలో మాకు ఒక మంచి ఆటగాడు దొరికాడు. ఇక డికాక్ కూడా తనదైన రోజున జట్టును గెలిపించగలడు. మాకు రబాడా, ఎంగడీ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగలరు. మా బౌలర్లు ఇప్పటికే భారత్‌పై పట్టును కలిగి ఉన్నారు. చివరగా నేను చెప్పేది ఒక్కటే.. ఈసారి కూడా భారత జట్టు సిరీస్‌ను గెలవలేరు అని ముఖాయ ఎన్తిని పేర్కొన్నాడు.
చదవండి: Abid Ali: పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి
Comments
Please login to add a commentAdd a comment