Makhaya Ntini
-
హీరో అవ్వాలని చూడకు.. బ్రెయిన్ వాడు: బుమ్రాకు స్ట్రాంగ్ వార్నింగ్!
Don’t try to be a hero from day one Bumrah: ‘‘అత్యుత్తమైన ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడన్న సంగతి అందరికీ తెలిసిందే. బుమ్రా తనదైన శైలిలో బౌలింగ్‌లో చెలరేగుతుంటే చూడాలని ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటాడు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడిప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్న బుమ్రా తొందరపడకూడదు. బ్రెయిన్ వాడు బుమ్రా తన అనుభవాన్ని రంగరించి.. తెలివిగా బౌలింగ్ చేస్తూ శారీరక శ్రమను ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. మెదడునే ఎక్కువగా ఉపయోగించాలి. మైదానంలో దిగిన తొలిరోజు నుంచే హీరో అవ్వాలనే తాపత్రయం తగదు. మరీ దూకుడుగా ఆడాలని చూస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. ముందు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించాలి. ఆ తర్వాతే శరీరాన్ని కష్టపెట్టినా పెద్దగా చింతించాల్సిన అవసరం ఉండదు. నేనైతే బుమ్రాకు ఇచ్చే ప్రధాన సలహా ఇదే’’ అని సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయ ఎన్తిని అన్నాడు. ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ వెన్నునొప్పి నుంచి కోలుకుని మైదానంలో దిగుతున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమైన ఈ పేసుగుర్రం.. సుమారు పదకొండు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. PC: BCCI ఆరంభంలోనే రెచ్చిపోయిన బుమ్రా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు. ఇక ఐరిష్ జట్టుపై తొలి మ్యాచ్ నుంచే రెచ్చిపోయిన బుమ్రా.. తన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. పునరాగమనంలో రెండు మ్యాచ్‌లలో వరుసగా 2, 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో టీ20 ఆడలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత బుమ్రా.. ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు. పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ వన్డే టోర్నీ ఆగష్టు 30న ఆరంభం కానుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన మఖాయ ఎన్తినికి బుమ్రా గురించి ప్రశ్న ఎదురైంది. అలా అయితే మొదటికే మోసం ఇందుకు బదులుగా ఎన్తిని పైవిధంగా స్పందించాడు. ఇప్పటి నుంచి బుమ్రా మరింత జాగ్రత్తగా ఉండాలని.. మళ్లీ గాయం బారిన పడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. బుమ్రా తన శరీరం కంటే కూడా మెదడునే బాగా ఉపయోగించాలని 46 ఏళ్ల ఎన్తిని సలహా ఇచ్చాడు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్.. EXCLUSIVE: "He shouldn't try to be a hero from Day 1, he can get injured"- Makhaya Ntini's advice for #JaspritBumrah. Former @ProteasMenCSA pacer shares his insights on India and #SouthAfrica's prospects in the #ICCWorldCup2023, how effective will Nortje and Rabada be at the… pic.twitter.com/OLhtQkxeao — RevSportz (@RevSportz) August 29, 2023 -
WI VS SA: తండ్రుల కాలం అయిపోయింది, కొడుకులు తయారయ్యారు
వెస్టిండీస్-సౌతాఫ్రికా (సౌతాఫ్రికన్ ఇన్విటేషన్ XI) జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 21) మొదలైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 1990, 2000 దశకాల్లో స్టార్లుగా వెలిగిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల తనయులు ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధులుగా ఎదురెదురుపడ్డారు. ఎదురెదురుపడటమే కాకుండా తండ్రుల తరహాలోనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం కూడా చేశారు. అంతిమంగా దిగ్గజ బౌలర్ తనయుడు.. దిగ్గజ బ్యాటర్ తనయుడికి విసుగు తెప్పించి వికెట్ దొరకబుచ్చుకున్నాడు. ఇంతకీ ఆ తండ్రులు, వారి పుత్రరత్నాలు ఎవరంటే..? Wonderful pressure applied by Thando Ntini who picks up Tagenarine Chanderpaul after racking up some dot balls He has been getting some nice shape away from the lefties and inswing to Braithwaite this morning#SAXIvWI pic.twitter.com/OYksHFjRk8 — Werner (@Werries_) February 21, 2023 వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ తనయుడు తేజ్‌నరైన్ చంద్రపాల్, మరొకరు సౌతాఫ్రికా లెజండరీ ఫాస్ట్ బౌలర్ మఖాయ ఎన్తిని కొడుకు థాండో ఎన్తిని. 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న వెస్టిండీస్.. సౌతాఫ్రికన్ ఇన్విటేషన్ XI జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్, థాండో ఎదురెదురు పడ్డారు. వెస్టిండీస్ తరఫున ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన తేజ్‌నరైన్.. ఫాస్ట్ బౌలర్ థాండోను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో వరుస డాట్ బాల్స్‌తో తేజ్‌నరైన్ (1) సహనాన్ని పరీక్షించిన థాండో.. ఫైనల్‌గా అతని వికెట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు రకరాకల కామెంట్లతో ఇరువురు ఆటగాళ్ల తండ్రులను గుర్తు చేసుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయులు అంటూ వీరిని ఆకాశానికెత్తుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తేజ్‌నరైన్, థాండో ఇద్దరూ తండ్రుల తరహాలోనే బ్యాటింగ్, బౌలింగ్ స్టైల్ కలిగి ఉండటం. వీరిద్దరు అచ్చుగుద్దినట్లు తండ్రుల తరహాలోనే హావభావాలు సైతం పలికించారు. వీరిలో తేజ్‌నరైన్ ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుండగా.. 22 ఏళ్ల థాండో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తేజ్‌నరైన్ 4 టెస్ట్‌ల్లో 69.67 సగటున డబుల్ సెంచరీ, సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 418 పరుగుల సాధించగా.. థాండో సౌతాఫ్రికా అండర్-19 జట్టు తరఫున సత్తా చాటాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీమ్ 41 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండో రోజు ఆట కొనసాగుతోంది. విండీస్ ఇన్నింగ్స్‌లో జాషువ డిసిల్వ (55), జేసన్ హోల్డర్ (57) హాఫ్‌సెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికా ఆటగాళ్లు విహన్ లుబ్బే (67 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (13 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో తేజ్‌నరైన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగా.. థాండో కూడా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. -
"ఈ సారి కూడా విజయం మాదే.. టీమిండియాకు ఓటమి తప్పదు"
దక్షిణాఫ్రికా పర్యటనలలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో భాగంగా సెంచూరియాన్ వేదికగా తొలిటెస్ట్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ భారత్ గెలవలేదు. ఈ సారి కచ్చితంగా కోహ్లి సేన తొలి సిరీస్ కైవసం చేసుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ప్రోటాస్ మాజీ పేసర్ ముఖాయ ఎన్తిని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కొన్నేళ్లుగా అత్యుత్తమ టెస్టు జట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని, కానీ స్వదేశంలో టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాము అని అతడు తెలిపాడు. “ప్రస్తుతం భారత్ అత్యుత్తమ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగహన ఉంది. మా జట్టులో డీన్ ఎల్గర్, టెంబా బావుమా వంటి ఆద్బుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా వాన్ డెర్ డుస్సెన్ రూపంలో మాకు ఒక మంచి ఆటగాడు దొరికాడు. ఇక డికాక్ కూడా తనదైన రోజున జట్టును గెలిపించగలడు. మాకు రబాడా, ఎంగడీ వంటి స్టార్ పేసర్లు ఉన్నారు. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగలరు. మా బౌలర్లు ఇప్పటికే భారత్‌పై పట్టును కలిగి ఉన్నారు. చివరగా నేను చెప్పేది ఒక్కటే.. ఈసారి కూడా భారత జట్టు సిరీస్‌ను గెలవలేరు అని ముఖాయ ఎన్తిని పేర్కొన్నాడు. చదవండి: Abid Ali: పాక్ క్రికెటర్ ఆబిద్ అలీకి యాంజియో ప్లాస్టీ.. రెండు నెలలు విశ్రాంతి -
'టమాటో చెట్టుకు ఉరి వేసుకోవాలనుకున్నా'
హరారే: చాలాసార్లు ఓటమి మనుషిని కుంగదీస్తుంది. కొన్నిసార్లైతే చనిపోవాలని కూడా అనిపిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లాంటి ఆటల్లోనైతే టెన్షన్ భరించడం చాలా కష్టం. భారీ ఆశలు పెట్టుకున్న తన జట్టు పేక మేడలా కూలిపోతుంటే, ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తింటోంటే.. ఏ శిక్షకుడికైనా రోషం పొడుచుకొస్తుంది. ఆ కోపం అదుపుతప్పినప్పుడు ఆత్మహత్యచేసు కోవాలని కూడా పిస్తుంది.. జింబాబ్వే కోచ్ ముకాయా ఎన్తిని లాగా. భారత్ పై జింబాబ్వే వరుస ఓటములు జీర్ణించుకోలేకపోతున్నానన్న ఎన్తిని.. 'ఈ ఓటమి చూశాక నాకు బతకాలని లేదు. టమాటా చెట్టుకు ఉరి వేసుకుని చచ్చిపోదామనుకున్నా. స్టేడియం బయట టమాటో చెట్లు ఉండిఉంటే.. ఈ పాటికి మీరు ఎన్తిని మరణవార్తలు రాసేవారు' అంటూ ఒక్కతీరుగా ఆగ్రహావేశానికి లోనయ్యాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ గా ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్లను గడగడలాడించిన ఎన్తిని.. ఇంతలా కుంగిపోవడానికి బలమైన కారణంఉంది. (చదవండి: క్లీన్ స్వీప్ లాంఛనమ!) జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత్ మూడు వన్ డేల సిరీస్ ను మరో మ్యాచ్ ఉందనగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ లో జింబాబ్వే కనీస పోరాటం చేయకుండా చేతులెత్తేయడాన్ని ఆ దేశాభిమాను జీర్ణించుకోలేకపోయారు. 'ఈ ఘోరఅవమానాన్ని మేం చూడలేం' అంటూ స్టేడియంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేసి, ఫ్లకార్డులు చూపారు. ఓట్ ఫీల్డ్ లో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న ఎన్తినిని ఆ అభిమానుల చర్యలు బాధపెట్టాయట. అందుకే టొమాటో చెట్టుకు ఉరివేసుకుందామనుకున్నాడట! వాట్ మోర్ రాజీనామా తర్వాత ఎన్తిని జింబాబ్వే తాత్కాలిక కోచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. -
'వారికి దక్షిణాఫ్రికా క్రికెట్ సాయం లేదు'
జొహన్నెస్‌బర్గ్: పొరుగునే ఉన్న జింబాబ్వే క్రికెట్ కు సహకరించాలనే యోచన తమ దేశ క్రికెట్ బోర్డుకు ఏ రోజూ ఉండదని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మకాయా ఎన్తిని విమర్శించాడు. జింబాబ్వే క్రికెట్ పరంగా వెనుకబడి ఉన్నా, పక్కనే ఉన్నక్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) అసలు పట్టించుకోలేక పోవడం నిజంగా బాధాకరమన్నాడు. తాజాగా జింబాబ్వే క్రికెట్‌కు ప్రధాన కోచ్ గా ఎంపికైన ఎన్తిని తన కొత్త బాధ్యత పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వే క్రికెట్ ను మెరుగు పరిచే క్రమంలోనే తాను జింబాబ్వే కోచ్ పదవిని స్వీకరించినట్లు స్పష్టం చేశాడు. దీంతో పాటు జింబాబ్వే క్రికెట్ పట్ల దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వ్యవహరించే తీరు ఎంతమాత్రం సరైన దిశలో లేదన్నాడు. అసలు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఏ ప్రణాళికతో ముందుకెళుతుందో తనకు తెలియదన్నాడు. మిగతా దేశాలతో ఆడటానికి మొగ్గు చూపే దక్షిణాఫ్రికా.. ఏ రోజూ జింబాబ్వే సిరీస్ ఆడి వారికి అండగా నిలబడాలనే యోచనే లేకపోవడం నిజంగా బాధాకరమన్నాడు.