సహచర ఆటగాళ్లతో బుమ్రా (PC: BCCI)
Don’t try to be a hero from day one Bumrah: ‘‘అత్యుత్తమైన ఫాస్ట్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఒకడన్న సంగతి అందరికీ తెలిసిందే. బుమ్రా తనదైన శైలిలో బౌలింగ్‌లో చెలరేగుతుంటే చూడాలని ప్రతి ఒక్క క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటాడు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడిప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్న బుమ్రా తొందరపడకూడదు.
బ్రెయిన్ వాడు బుమ్రా
తన అనుభవాన్ని రంగరించి.. తెలివిగా బౌలింగ్ చేస్తూ శారీరక శ్రమను ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. మెదడునే ఎక్కువగా ఉపయోగించాలి. మైదానంలో దిగిన తొలిరోజు నుంచే హీరో అవ్వాలనే తాపత్రయం తగదు.
మరీ దూకుడుగా ఆడాలని చూస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. ముందు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించాలి. ఆ తర్వాతే శరీరాన్ని కష్టపెట్టినా పెద్దగా చింతించాల్సిన అవసరం ఉండదు. నేనైతే బుమ్రాకు ఇచ్చే ప్రధాన సలహా ఇదే’’ అని సౌతాఫ్రికా మాజీ పేసర్ మఖాయ ఎన్తిని అన్నాడు.
ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ
వెన్నునొప్పి నుంచి కోలుకుని మైదానంలో దిగుతున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమైన ఈ పేసుగుర్రం.. సుమారు పదకొండు నెలల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.
PC: BCCI
ఆరంభంలోనే రెచ్చిపోయిన బుమ్రా
ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయం అందించాడు. ఇక ఐరిష్ జట్టుపై తొలి మ్యాచ్ నుంచే రెచ్చిపోయిన బుమ్రా.. తన బౌలింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు.
పునరాగమనంలో రెండు మ్యాచ్‌లలో వరుసగా 2, 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మూడో టీ20 ఆడలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత బుమ్రా.. ఆసియా కప్-2023 బరిలో దిగనున్నాడు.
పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్
పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ వన్డే టోర్నీ ఆగష్టు 30న ఆరంభం కానుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన మఖాయ ఎన్తినికి బుమ్రా గురించి ప్రశ్న ఎదురైంది.
అలా అయితే మొదటికే మోసం
ఇందుకు బదులుగా ఎన్తిని పైవిధంగా స్పందించాడు. ఇప్పటి నుంచి బుమ్రా మరింత జాగ్రత్తగా ఉండాలని.. మళ్లీ గాయం బారిన పడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. బుమ్రా తన శరీరం కంటే కూడా మెదడునే బాగా ఉపయోగించాలని 46 ఏళ్ల ఎన్తిని సలహా ఇచ్చాడు.
చదవండి: WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
EXCLUSIVE: "He shouldn't try to be a hero from Day 1, he can get injured"- Makhaya Ntini's advice for #JaspritBumrah.
— RevSportz (@RevSportz) August 29, 2023
Former @ProteasMenCSA pacer shares his insights on India and #SouthAfrica's prospects in the #ICCWorldCup2023, how effective will Nortje and Rabada be at the… pic.twitter.com/OLhtQkxeao
Comments
Please login to add a commentAdd a comment