Asia Cup 2023: రీఎంట్రీలో.. బుమ్రా ఎట్టకేలకు! వీడియో వైరల్‌ | India Vs. Pakistan, Asia Cup 2023 Super 4: Jasprit Bumrah Back In ODIs, Imam-Ul-Haq Departs- Sakshi
Sakshi News home page

Ind vs Pak: రీఎంట్రీలో.. బుమ్రా ఎట్టకేలకు! వీడియో వైరల్‌

Published Mon, Sep 11 2023 8:17 PM | Last Updated on Mon, Sep 11 2023 8:59 PM

Asia Cup 2023 Ind vs Pak: Bumrah Back In ODIs Imam Departs - Sakshi

Asia Cup 2023- India vs Pakistan- Jasprit Bumrah: వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమయ్యాడు టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. అతడు లేకుండానే భారత జట్టు ఆసియా కప్‌-2022 సహా టీ20 ప్రపంచకప్‌-2022 ఆడింది. ఈ రెండు మెగా ఈవెంట్లలో బూమ్‌ బూమ్‌ బుమ్రా లేనిలోటు స్పష్టంగా కనిపించింది.

సుదీర్ఘకాలం పాటు ఎన్సీఏలో
టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీల్లో పూర్తిగా వైఫల్యం చెందిన టీమిండియా విమర్శలు మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో సుదీర్ఘకాలం పునరావాసం పొందాడు. 

ఫిట్‌నెస్‌ సాధించి ఏకంగా కెప్టెన్‌గా రీఎంట్రీ
ఈ క్రమంలో నిపుణుల పర్యవేక్షణలో జిమ్‌లో కసరత్తులు చేస్తూ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చి.. ఆటకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌ పర్యటన నేపథ్యంలో ఏకంగా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.

ఐరిష్‌ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచింది. ఈ టూర్‌లో బుమ్రా.. నాలుగు వికెట్లతో మెరిశాడు. ఆసియా వన్డే కప్‌-2023కి ముందు పేస్‌గుర్రానికి ఈ మేరకు ఐర్లాండ్‌ పర్యటన రూపంలో మంచి ప్లాట్‌ఫామ్‌ లభించింది.

వన్డేల్లో ఎట్టకేలకు వికెట్‌తో బూమ్‌ బూమ్‌
టీ20లో సత్తా చాటిన బుమ్రా.. వన్డేల్లోనూ రాణిస్తే చూడాలని అభిమానులు భావించగా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరింది. ఈ ఈవెంట్లో గ్రూప్‌ స్టేజిలో వర్షం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియాకు బౌలింగ్‌ చేసే అవకాశమే రాలేదు.

ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు తన భార్య సంజనా గణేషన్‌ ప్రసవం నేపథ్యంలో బుమ్రా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సూపర్‌-4 దశలో రిజర్వ్‌ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.

తొలి వికెట్‌ బుమ్రాదే
ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్‌ పడగొట్టాడు. 357 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. అద్భుతంగా స్వింగ్‌ అయిన ఈ బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ ఇమామ్‌.. సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోగా.. చాలా కాలం తర్వాత వన్డే క్రికెట్‌లో బుమ్రా ఖాతాలో వికెట్‌ వచ్చి చేరింది.

చదవండి: రోహిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement