Ravi Ashwin on selectors radar for South Africa ODIs: భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దాదాపు నాలుగేళ్ల తరువాత పునరాగమనం చేశాడు. టీ20 ప్రపంచకప్‌తో రీఎంట్రీ ఇచ్చిన అశ్విన్ అద్బుతంగా రాణించాడు. తరువాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగిన టీ20 సిరీస్‌లోను అద్బుతమైన ప్రదర్శన చేశాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్న అశ్విన్ సెలెక్టర్ల దృష్టిని మరింత ఆకర్షించాడు. ఈ క్రమంలో త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అశ్విన్ ఎంపిక చేసే ఆలోచనలో సెలెక్షన్ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా అశ్విన్‌కి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహాల్ రూపంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కాగా చివరి వన్డే మ్యాచ్ 2017లో ఆడాడు. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇక గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక టెస్ట్ సిరీస్ ముగిశాక జనవరి19 నుంచి దక్షిణాఫ్రికా- భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: Ind vS SA Test: నోర్జే లేడు.. కష్టమే.. భారమంతా రబడపైనే.. మరి కేశవ్ మహరాజ్?
Comments
Please login to add a commentAdd a comment