దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్ట్‌కు సిద్దం అవుతోంది. సెంచూరియాన్ వేదికగా డిసెంబర్ 26న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్‌కు ముందు భారత జట్టు సెంచూరియన్ చేరుకుని ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 'ఓవర్‌లోడ్' కిట్ బ్యాగ్ మోసుకుని ప్రాక్టీస్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కోహ్లి ఆ బ్యాగ్‌లో ఏమి తీసుకువెళ్లాడని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.
కాగా కోహ్లి.. సుదీర్ఘ సిరీస్ లేదా పర్యటనకు వెళ్లినప్పుడు 10 బ్యాట్‌లు,10 జతల గ్లోవ్‌లను తీసుకువెళతానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లి సెంచూరియాన్ వేదికగా 153 పరుగులు సాధించాడు. తొలి టెస్ట్ కూడా ఇదే వేదికగా జరుగతుండడంతో కోహ్లి మరోసారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే విధంగా కోహ్లి నాయకత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
చదవండి: Rishabh Pant: రిషభ్‌పంత్‌కు లక్కీ ఛాన్స్.. ట్వీట్ చేసిన ఉత్తరాఖండ్ సీఎం
Getting Test-match ready 👌 👌
— BCCI (@BCCI) December 19, 2021
🎥 Snippets from #TeamIndia's first practice session ahead of the first #SAvIND Test. pic.twitter.com/QkrdgqP959
Comments
Please login to add a commentAdd a comment