దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత్ అన్ని విధాలా సన్నద్దం అవుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ఒమ్రికాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా 2021కి సంబంధించి 4-రోజుల డొమెస్టిక్ సిరీస్‌లోని మిగిలిన రౌండ్‌ను వాయిదా వేసస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది.
"డిసెంబర్ 16-19 (డివిజన్ టూ), డిసెంబర్ 19-22 (డివిజన్ వన్) మధ్య జరగాల్సిన ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుతం బయట కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవలివచ్చింది. ఈ మ్యాచ్‌లకు సంబంధించి కొత్త షెఢ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తాం" అని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
చదవండి: Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment