గత రెండేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విషయమై ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ పరంగా కోహ్లి ప్రస్తుతం గడ్డు పరిస్థితలను ఎదుర్కొంటున్నప్పటికీ, అతను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని అన్నాడు.
తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఎన్నో వ్యక్తిగత రికార్డులతో పాటు టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన రన్ మెషీన్‌కు బ్యాటింగ్‌లో విఫలమయ్యే హక్కు, అధికారం రెండూ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆటగాడు ఫామ్ కోల్పోవడం సహజమని, కోహ్లి విషయంలోనూ అదే జరిగిందని, యంత్రంలా పరుగులు చేసేందుకు అతనేమీ రోబో కాదని వెనకేసుకొచ్చాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ సాధించి రెండేళ్లు పూర్తైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని కోల్పోవడంతో పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతని ర్యాంకు క్రమంగా దిగజారుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లికి జట్టులో చోటు సైతం ప్రశ్నార్ధకంగా మారింది.
చదవండి: Ashes: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు... బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పాటుగా
Comments
Please login to add a commentAdd a comment