టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా విరాట్ కోహ్లిని బీసీసీఐ తొలిగించిన సంగతి తెలిసిందే. కాగా కోహ్లిను తప్పించి రోహిత్‌కి కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పడంపై బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. తరువాత బీసీసీఐపై విరాట్ కోహ్లి సంచలన వాఖ్యలు చేశాడు. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలిగించారని విరాట్ ఆరోపించడంతో.. ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం కోహ్లి కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
అయితే ఈ మధ్యన చెలరేగిన వివాదాల అన్నింటికి కోహ్లి తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడని అతడి చిన్ననాటి కోచ్ రాజ్‌కూమార్ శర్మ చెప్పారు. "ఏది జరిగినా తన మంచికే. విరాట్ కేరిర్‌లో ఎప్పుడూ ఏదైనా వివాదానికి తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. ఈ సారి కూడా అలా జరిగితే, అది భారత జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. దక్షిణాఫ్రికా పేస్ బౌలింగ్ విభాగం చాలా అత్యుత్తమైనది. ఈ సిరీస్‌లో విరాట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడడం భారత జట్టుకు చాలా కీలకం. ఈ సారి కూడా తన బ్యాట్‌తో కోహ్లి పరుగుల సునామీ సృష్టిస్తాడని భావిస్తున్నాను" అని ఇండియా టీవికు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కూమార్ శర్మ పేర్కొన్నాడు. ఇక డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
చదవండి: "గంగూలీ నీ పని నువ్వు చూసుకో.. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు"
Comments
Please login to add a commentAdd a comment