జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌లో అంపైర్‌గా అల్లావుద్దీన్ పాలేకర్ అరంగేట్రం చేశాడు. పాలేకర్ ఈ టెస్ట్‌లో అంపైర్‌గా అత్యత్తుమ నిర్ణయాలు తీసుకుని అందరినీ అకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అల్లావుద్దీన్ పాలేకర్ భారత సంతతికి చెందినవాడే. పాలేకర్ మహారాష్ట్రలోని శివ్ గ్రామానికి చెందినవాడని, అల్లా వుద్దీన్ తండ్రి ఉద్యోగ రీత్యా దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడని శివ్ గ్రామాధిపతి దుర్వేష్ పాలేకర్ వెల్లడించాడు.
"నేను కూడా పాలేకర్‌నే. అల్లా వుద్దీన్ మా గ్రామానికి చెందినవాడే. అతడి తండ్రి ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. అల్లాహుదీన్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అతడి సొంత గ్రామం శివ్. మా గ్రామం పేరు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లినందుకు మేమందరం గర్విస్తున్నాం" అని దుర్వేష్ పాలేకర్ పేర్కొన్నాడు. అదే విధంగా 2014-15 రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా అల్లావుదీన్ పాలేకర్ అంపైరింగ్ విధులను నిర్వహించాడు. ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే విజయానికి దక్షిణాఫ్రికా 122 పరుగుల దూరంలో ఉంది.
చదవండి: SA vs IND: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment