'రోహిత్ భయ్యా‌.. ద్రవిడ్‌ సర్‌కు చాలా థ్యాంక్స్‌' | Venkatesh Iyer Thanks Rohit Sharma And Rahul Dravid For Their Support | Sakshi
Sakshi News home page

Venkatesh Iyer: 'రోహిత్ భయ్యా‌.. ద్రవిడ్‌ సర్‌కు చాలా థ్యాంక్స్‌'

Published Tue, Nov 23 2021 9:00 PM | Last Updated on Tue, Nov 23 2021 9:09 PM

Venkatesh Iyer Thanks Rohit Sharma And Rahul Dravid For Their Support - Sakshi

Venkatesh Iyer Thanks To Rohit Sharma And Rahul Dravid.. కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 4,12 నాటౌట్‌, 20 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లో పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి అరంగేట్రంలో మంచి మార్కులే సంపాదించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ అవకాశం రాని వెంకటేశ్‌ చివరి టి20లో మాత్రం బౌలింగ్‌ చేసి ఆడమ్‌ మిల్నేను ఔట్‌ చేసి తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ అయ్యర్‌ తనకు అవకాశమిచ్చిన రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఒక లేఖ రాసుకొచ్చాడు. 

చదవండి: Virat Kohli: 732 రోజులు.. సెంచరీ కోసం పరితపిస్తున్నాడు!

''న్యూజిలాండ్‌తో టి20  సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచిన తర్వాత రోహిత్‌ భయ్యా నా దగ్గరకు వచ్చి ట్రోఫీ ఇచ్చాడు. విన్నింగ్‌ ట్రోఫీని పట్టుకోవడం ఆ క్షణంలో కాస్త ఎమోషనల్‌గా అనిపించింది. ట్రోఫీ అందుకోవడం గర్వంగా ఫీలయ్యా. సీనియర్‌ ఆటగాళ్లతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ భయ్యా.. కోచ్‌ ద్రవిడ్‌ సర్‌ చక్కగా సహకరించారు. ఇక ట్రోఫీ అందిస్తూ రోహిత్‌ భయ్యా.. వెల్‌డన్‌.. గుడ్‌జాబ్‌.. కీప్‌ ఇట్‌ అప్‌ అని చెప్పడం సంతోషం కలిగించింది. ఇక డెబ్యూ మ్యాచ్‌లో క్యాప్‌ అందుకున్న తర్వాత రోహిత్‌ భయ్యా విలువైన సూచనలు.. సలహాలు అందించాడు. ఒక కెప్టెన్‌గా తను ఏం చేయాలో అది చేసి మాకు ధైర్యం ఇవ్వడం ఎన్నటికి మరిచిపోను అంటూ'' చెప్పుకొచ్చాడు.

చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్‌.. గాయంతో కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement