photo credit: IPL Twitter
ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. ఐపీఎల్‌లో అయ్యర్‌కు ఇది తొలి శతకం కాగా.. కేకేఆర్ తరఫున కేవలం రెండవది మాత్రమే. అరంగేట్రం సీజన్ తొలి మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ (158 నాటౌట్) బాదిన సెంచరీ ఒక్కటే ఇప్పటివరకు కేకేఆర్ తరఫున నమోదై ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత కేకేఆర్ తరఫున ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదైందన్న మాట.
కాగా, కేకేఆర్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 3 ఫోర్లు (శార్దూల్ 1, రింకూ 2) కొడితే, ఒక్క వెంకటేశ్ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5), శార్దూల్ ఠాకూర్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. అయ్యర్‌కు జతగా రింకూ సింగ్ (18) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గ్రీన్, పియూష్ చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment