IPL 2021: Venkatesh Iyer Creates Record for KKR - Sakshi
Sakshi News home page

Venkatesh Iyer: అయ్యారే అయ్యర్‌.. కేకేఆర్‌ తరపున రెండో బ్యాటర్‌గా

Published Fri, Oct 1 2021 10:11 PM | Last Updated on Sat, Oct 2 2021 12:26 PM

Venkatesh Iyer Record Most Runs For KKR After First 5 IPL Matches - Sakshi

Courtesy: IPL Twitter

Venkatesh Iyer Most runs for KKR.. కేకేఆర్‌ ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో అయ్యర్‌కు ఇది రెండో అర్థశతకం. ఈ నేపథ్యంలోనే తాజా అర్థసెంచరీతో వెంకటేశ్‌ అయ్యర్‌ కేకేఆర్‌ తరపున ఒక రికార్డు అందుకున్నాడు. కేకేఆర్‌ తరపున డెబ్యూ ఐపీఎల్‌ ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ తొలి ఐదు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అయ్యర్‌ ఐదు మ్యాచ్‌ల్లో 193 పరుగులు చేయగా.. జాక్‌ కలిస్‌ కేకేఆర్‌ తరపున ఐదు మ్యాచ్‌ల్లో 193 పరుగులు చేసి స్ట్రైక్‌ రేట్‌ ఎక్కువగా ఉండడంతో తొలి స్థానంలో ఉ‍న్నాడు. ఆ తర్వాత బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ తొలి ఐదు మ్యాచ్‌ల్లో 189 పరుగులతో మూడో స్థానంలో.. క్రిస్‌ లిన్‌ 179 పరుగులతో నాలుగో స్థానంలో ఉ‍న్నాడు.


Courtesy: IPL Twitter
ఇక కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(67 పరుగులు) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. రాహుల్‌ త్రిపాఠి 34, నితీష్‌ రాణా 31 పరుగులతో అయ్యర్‌కు సహకరించారు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: IPL 2021: షమీ సూపర్‌ త్రో.. డెబ్యూ మ్యాచ్‌లోనే రనౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement