
Photo Credit : IPL Website
ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన అర్జున్.. కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినప్పటికీ, తన రెండో ఓవర్‌లో మాత్రం వెంకటేశ్ అయ్యర్ చేతికి చిక్కి బలయ్యాడు.
Photo Credit : IPL Website
ఈ ఓవర్‌లోనూ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వని అర్జున్.. ఆ తర్వాత బంతిని వైడ్ వేసి, ఆ వెంటనే వరుసగా 2 పరుగులు, 0, బౌండరీ, సిక్సర్ సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో అయ్యర్ ధాటికి మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్ సూర్యకుమార్ అర్జున్‌ను బౌలింగ్ నుంచి తప్పించి డ్యూయాన్ జన్సెన్‌కు బంతిని అప్పజెప్పాడు.
కాగా, సుదీర్ఘకాలంగా (రెండేళ్లుగా) ఐపీఎల్ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అర్జున్‌కు ఓ మోస్తరు ప్రారంభమైతే లభించింది. ఎన్నో అంచనాల నడుమ కుటుంబ సభ్యుల సమక్షంలో బరిలోకి దిగిన అర్జున్ తొలి ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనించాడు. అయితే రెండో ఓవర్‌లో మాత్రం అర్జున్ కాస్త తడబడ్డాడు. తన కోటా ఓవర్లు మొత్తం పూర్తయితే కాని అతను బౌలింగ్‌పై ఓ అంచనాకు రాలేని పరిస్థితి. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అర్జున్ తొలి బంతి నుంచి రన్‌అప్‌తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతని శైలి ఆశిష్ నెహ్రాను తలపించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం వేగం లోపించింది. అతను బౌల్ చేసిన 13 బంతులు 130కిమీ వేగం లోపే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. 8.1 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్భాజ్ (8), జగదీశన్ (0), నితీశ్ రాణా (5) ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (22 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.