Venkatesh Iyer Receives Special Message From Seth Rollins: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందింది. అతను ఎంతో అభిమానించే క్రికెటేతర వ్యక్తి వెంకటేశ్ అయ్యర్‌కు ప్రత్యేక సందేశం పంపాడు. ఇంతకీ ఆ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు..? ఆ మెసేజ్‌లో ఏముంది..? వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. తాను డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ సెథ్ రోలిన్స్‌ను వీరభిమానినని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ రోలిన్స్.. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి కొద్ది గంటల ముందు తన ఫ్యాన్ వెంకటేశ్ అయ్యర్‌ను సర్‌ప్రైజ్ చేశాడు.
వెంకటేష్.. మై ఫ్రెండ్. నేను సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్. మీరు నా అభిమాని కావడంలో ఆశ్చర్యం లేదు. నా మిత్రమా, ప్రస్తుతం మీ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. ఈ కప్ గెలవడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. కష్టపడి ఆడు.. అంటూ వీడియో సందేశం పంపాడు. ఈ వీడియోను WWE India తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరలవుతోంది. రోలిన్స్ గతంలో డీన్‌ఆంబ్రోస్, రోమన్ రెయిన్స్‌తో కలిసి షీల్డ్ గ్రూప్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
.@WWERollins’ message for @KKRiders' @venkateshiyer ahead of #IPL2022. #WrestleMania #MeraWrestleMania #WWEonSonyIndia pic.twitter.com/xtjmx269Hs
— WWE India (@WWEIndia) March 25, 2022
మరోవైపు, ఐపీఎల్ 15వ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ముందు తన ఆరాధ్య రెజ్లర్ నుంచి స్పెషల్ మెసేజ్ అందటంతో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. ఈ బూస్టప్ డోస్‌తో క్రితం ఏడాది మాదిరే ఈ సీజన్‌లోనూ రెచ్చిపోవాలని భావిస్తున్నాడు. అయ్యర్ గత సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి, కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 26) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 26 సార్లు తలపడగా, సీఎస్‌కే 17, కేకేఆర్ 8 సందర్భాల్లో విజయాలు సాధించాయి.
చదవండి: IPL 2022: చెన్నై, కేకేఆర్ ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ అరుదైన రికార్డులేంటో చూద్దాం..!
Comments
Please login to add a commentAdd a comment