PC: BCCI
Venkatesh Iyer Said His Dream Is to Win Tournaments for India: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఆదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం( నవంబర్17) న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టిస్ సెషన్‌లో అయ్యర్‌పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. ప్రత్యేక దృష్టి సారించడంతో అతడికి తుది జట్టులో స్ధానం దక్కడం ఖాయం అనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయ్యర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దేశం కోసం ఆడడమే తన చిరకాల కోరిక అని అయ్యర్ తెలిపాడు.
"నేను కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాను. నాజట్టు ఏ విధంగా అయితే పురోగతి సాధించిందో.. నేను కూడా అదే విధంగా పురోగమించి ఈ స్ధాయికి చేరుకున్నాను. దేశం కోసం ఆడటం ఏ ఆటగాడికైనా ఒక కల. కానీ అంతకమించి దేశం కోసం మేజర్ టోర్నీలు గెలిచేలా ఆడటం ముఖ్యం" అని అయ్యర్ పేర్కొన్నాడు.
అదేవిధంగా మధ్యప్రదేశ్ జట్టులో తన సహచరడైన ఆవేశ్‌ఖాన్ గురించి మాట్లాడుతూ.. "వ్యక్తిగతంగా చెప్పాలంటే..నా కంటే ఆవేశ్ భారత జట్టుఎంపిక కావడం సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో మేము ఇద్దరం ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దాదాపు ఐదేళ్లుగా డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాం. అతడు పడిన కష్టాలను దగ్గరుండి నేను చేశాను. అందుకే నాకన్న తనకి అవకాశం దక్కడం నాకు సంతోషంగా అనిపిస్తుంది" అని అయ్యర్ పేర్కొన్నాడు.
చదవండి: Rahul Dravid: అక్కడ కోచింగ్ ఇచ్చినట్లు ఇక్కడ చేస్తానంటే కుదరదు కదా.. నాకు ఆ ఆలోచనే లేదు!
Of bond with buddy @Avesh_6 👌
— BCCI (@BCCI) November 17, 2021
Warm welcome from @ImRo45, Rahul Dravid & @RishabhPant17 👏
Special request for WWE's The Undertaker 😎 @ivenkyiyer2512 discusses it all with @28anand in this special feature. 👍 #TeamIndia #INDvNZ
Full interview 🎥 🔽 https://t.co/xPiTo2h1NL pic.twitter.com/hFbxv23wy7
Comments
Please login to add a commentAdd a comment