Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్.. తెలుగుతేజం నంబూరి తిలక్ వర్మ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుస అర్థసెంచరీలతో రాణించిన తిలక్ వర్మ ప్రస్తుతం ముంబై జట్టులో కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ తనలోని క్రీడాస్పూర్తిని బయటపెట్టాడు.
విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్బంగా నాలుగో ఓవర్లో కామెరున్ గ్రీన్ వేసిన బంతిని వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్ అయిన బంతి మోకాలికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో అయ్యర్ విలవిల్లాడాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ బాధను చూసి తట్టుకోలేక అతని కాలికున్న ప్యాడ్‌ను తొలగించి మోకాలికి మర్దన చేశాడు.
తిలక్ వర్మ చర్యతో వెంకటేశ్ అయ్యర్‌కు కాస్త ఉపశమనం కలిగింది. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఇక తిలక్ వర్మ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి హీరోగా మారాడు. తిలక్ వర్మ చేసిన పనికి అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ''తిలక్ వర్మ మంచి బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. సాయపడడంలోనూ ముందు వరుసలో ఉంటాడు..'' అంటూ కామెంట్ చేశారు.
మోకాలి గాయం బాధిస్తున్నా నొప్పిని భరిస్తూనే వెంకటేశ్ అయ్యర్ శతకంతో చెలరేగాడు. సీజన్‌లో రెండో సెంచరీ కాగా.. అయ్యర్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ. అయితే అయ్యర్ సెంచరీ వృథాగా మారింది. మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై విజయాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment