
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను రఘువంశీ అవహేళన చేయడమే ఇందుకు కారణం. అయితే తన తప్పు తెలుసుకున్న ఈ యువ క్రికెటర్.. సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు కూడా తెలిపాడు.
అసలేం జరిగిందంటే..?
బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవని, కానీ అభిమానులు మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని సైనా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించింది.
"సైనా ఏం చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రీడాకారుల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. ఎందుకంటే మేము మేము మంచి ప్రదర్శనలు కనబరిచి తరచుగా వార్తాపత్రికలలో వస్తుంటాం. మా లాంటి క్రీడాకారుల వల్ల భారత్‌కు గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది.
కానీ మన దేశంలో మాత్రం క్రీడా సంస్కృతి పెద్దగా లేదు. అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంటోందని కొన్నిసార్లు బాధేస్తుంది. క్రికెట్‌కు మిగితా క్రీడలకు చాలా తేడా ఉంది. క్రికెట్‌తో పోలిస్తే బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, ఇతర క్రీడలు శారీరకంగా చాలా కఠినమైనవి. షటిల్ తీసుకొని సర్వ్ చేసేంత సమయం కూడా ఉండదు.
అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. కానీ క్రికెట్‌లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. అయినప్పటకి క్రికెట్టే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుందని" అని నిఖిల్ సింహా పోడ్‌కాస్ట్‌లో సైనా నెహ్వాల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో సైనా వ్యాఖ్యలపై స్పందించిన రఘువంశీ వివాదస్పద ట్వీట్(ఎక్స్) చేశాడు. ‘‘బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌన్సర్ బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం’’ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. వెంటనే తన తప్పును గ్రహించిన రఘువంశీ తన చేసిన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. ఆమె సారీ చెబుతూ మరో పోస్ట్ చేశాడు.
అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలను సరదగా తీసుకుంటారు అనుకున్న. కానీ తర్వాత ఆలోచిస్తే ఆర్ధంలేని జోక్‌లా అన్పించింది. నేను నా తప్పును గ్రహించాను. అందుకే హృదయపూర్వకంగా క్షమాపణలు తెలుపుతున్నానని ఎక్స్‌లో రఘువంశీ మరో పోస్ట్ చేశాడు. కాగా 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అరంగేట్రం చేసిన రఘువంశీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 10 ఇన్నింగ్స్ ఆడి.. 115.24 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు.
Saina Nehwal Stoodup and Spoken Some Harsh Facts 🔥 pic.twitter.com/gaF9fSROXc
— Gems of Shorts (@Warlock_Shabby) July 11, 2024
Comments
Please login to add a commentAdd a comment