ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(PC: IPL/BCCI)
IPL 2022 KKR Vs MI- Rohit Sharma Comments: ‘‘మా బౌలింగ్ విభాగం రాణించింది. బుమ్రా మరింత ప్రత్యేకం. కానీ మేము బ్యాటింగ్ చేసిన విధానం పూర్తిగా నిరాశపరిచింది. పిచ్ మరీ ప్రతికూలంగా ఏమీ లేదు. బ్యాటర్ల చెత్త ప్రదర్శన వల్లే ఇలా! నిజానికి ఇక్కడ మాకు ఇది నాలుగో మ్యాచ్.
పిచ్ ఎలా ఉంటుందో ఊహించగలం. సీమర్లకు అనూకలిస్తుందని తెలుసు. భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయాం’’ అంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ బ్యాటర్ల ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఐపీఎల్-2022లో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. మిగిలిన మ్యాచ్‌లలో గెలిచైనా పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలుకావడంతో ముంబైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కేకేఆర్ బౌలర్ల ధాటికి నిలవలేక ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇషాన్ కిషన్(51) మినహా ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. దీంతో లక్ష్య ఛేదనలో చతికిలపడిన రోహిత్ సేన 52 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘కేకేఆర్ బ్యాటర్లు మొదటి 10 ఓవర్లలో అద్భుతంగా ఆడారు. 11 ఓవర్లకే 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. అలాంటి సమయంలో మా బౌలర్లు తిరిగి పుంజుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా బుమ్రా అదరగొట్టాడు. కానీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ సీజన్‌లో రెండు విభాగాల్లోనూ నిలకడలేమి జట్టు గెలుపోటములపై ప్రభావం చూపింది.
ఈరోజైనా మేము దానిని సరిదిద్దుకోవాల్సింది. కానీ అలా జరుగలేదు’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 2 పరుగులు చేయగా.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఐపీఎల్ మ్యాచ్ 56: ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు
టాస్- ముంబై
కేకేఆర్- 165/9 (20)
ముంబై- 113 (17.3)
విజేత: కేకేఆర్(52 పరుగుల తేడాతో గెలుపు)
చదవండి👉🏾Ishan Kishan: బంతి కనిపించక ఇషాన్ కిషన్ ఉక్కిరిబిక్కిరి.. వీడియో వైరల్
చదవండి👉🏾IPL 2022 - MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని
That's that from Match 56.@KKRiders take this home comfortably with a 52-run win over #MumbaiIndians
— IndianPremierLeague (@IPL) May 9, 2022
Scorecard - https://t.co/eXsU8yDmge #MIvKKR #TATAIPL pic.twitter.com/3gu0ZsHYH6
Comments
Please login to add a commentAdd a comment